.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా ఉంది. అందులో రీతూ ఆ తర్వాత కార్తీక దీపం డాక్టర్ బాబు వచ్చి ఫోన్ లో వాళ్ళ నాన్నలతో మాట్లాడారు. వాళ్ళ మాటలకు అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. ఇంతకు వాళ్ళు ఎం మాట్లాడారు ఎం చెప్పారంటే...
"డాడీ ఐ లవ్ యు సో మచ్. నువ్వు గుర్తొస్తూనే ఉన్నావ్ డాడీ. నువ్వు పై నుంచి చూస్తూ నువ్వు చాలా హ్యాపీగా ఫీలవుతున్నావు. చాలా సారీ నువ్వు నాతో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొన్నిసార్లు నీ మాట వినలేదు. కొన్ని సార్లు అసలు నీకు రెస్పాండ్ కూడా అవ్వలేదు. నువ్వు వెళ్ళిపోయాక నేను భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అందరిలో నిన్ను వెతుక్కునే పనిలో పడిపోయాను. డాడీ కుదిరితే నా ముందు కనిపించు . " అని అడిగింది.
"చివరాఖరిగా నాన్న గారితో మాట్లాడే అవకాశం వస్తే ఎం మాట్లాడతారు " అని డాక్టర్ బాబుని అడిగింది శ్రీముఖి. " "నేనెప్పుడూ మా నాన్నగారిని నాన్నగారు అనే పిలుస్తాను. ఆయన ఫ్రెండ్లీగా ఉండరా ఫ్రెండ్ లా చూడరా అనేవారు. అప్పుడు ఉన్న ఏజ్ కి మనకు ఫ్రెండ్స్ ఎక్కువ కానీ ఇంట్లో వాళ్ళను పెద్ద లెక్క చేయము కదా. నా దగ్గర ఉంది బంగారం అని నాకు తెలుసు. అది ఎక్కడ ఉంటె దాని విలువ పెరుగుతుందో నాకు తెలుసు. నా కోసం చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. కరెక్ట్ గా 15 రోజుల ముందు ఆయన వదిలి వెళ్లిపోయారు. ఈరోజు నేను యాక్టర్ అయ్యాను మీ నమ్మకం గెలిచింది. నాకు ఒక కొడుకు పుట్టాడు వాడికి మీ పేరు పెట్టుకున్నాను ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది దానికి మీ పేరే పెట్టాను. బ్యాంక్ కి పంపేవారు. ఎందుకు ఈ చెత్త పనులన్నీ సోది పనులన్నీ నాకు చెప్తున్నారు అని విసుక్కుంటూనే వెళ్ళేవాడిని. కానీ అప్పుడు తెలీదు కదా అవన్నీ నేర్పించడానికి ఆయన ఉండరని. కానీ ఆ మనిషి లేనప్పుడే మనం ఎంత తప్పు చేసాం ఆ క్షణం ఎంత నెగ్లెక్ట్ చేసాం అనేది అర్ధమవుతుంది " అంటూ ఏడ్చేశాడు. దాంతో శ్రీముఖి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.




.webp)
