Home

»

Tv News

స్నేహంలో  వంద గొడవలు ఉంటాయి.. దానికి బ్రేకప్ ఏంటి: రీతూ చౌదరి!

Oct 1, 2026 6:26PM

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. బిగ్ బాస్ ఫేమ్ రీతూచౌదరి మరోసారి తన ఇన్‌స్టా స్టోరీతో వార్తల్లోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో డీమాన్ పవన్ తో సాగిన ట్రాక్ ని అందరు లవ్ అని కనెక్ట్ అయ్యారు. అయితే మొన్న(మంగళవారం) డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో.. ఫ్రెండ్ షిప్ బ్రేకప్ అంటు రాసాడు. అది తీసుకోని సోషల్ మీడియా మొత్తం రీతూ చౌదరితో డీమాన్ లవ్ బ్రేకప్ అంటు పోస్ట్, రీల్స్, వ్లాగ్స్ చేశారు. ఇక వీటన్నింటిని చూసిన రీతూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. 

ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ పై వస్తున్న రూమర్స్, వీడియోలు, రివ్యూలపై రీతూ చౌదరి స్ట్రాంగ్ గా స్పందించింది. అసలు friendship లో 100 గొడవలు ఉంటే దానికి బ్రేకప్ ఏంటో..  మేము ఏమైనా లవర్సా లేకపోతే మాకు పెళ్లి అని చెప్పామా..‌ఇది ఎక్కడ గోలరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో పనిపాటా లేకుండా వీడియోలు పెడుతున్న వారిపై రీతూ మండిపడింది. దానికి సోషల్ మీడియాలో పనిపాటా లేకుండా వీడియోస్ పెట్టుకోవడమేంటో.. దీనికి రివ్యూస్ ఏంటి.. ఇంత ఖాళీగా ఉన్నారారా మీరు, కొంతమంది అయితే వ్లాగ్స్ కూడా.. ఒరేయ్ మీ ఫ్రెండ్స్ తో మీకు గొడవలు అవ్వవా.. దేనికి రా నిబ్బా గాళ్లు, వాడు అదో పెట్టాడు.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా" అంటూ ఫైర్ అయ్యింది. తన స్నేహంలో గొడవలు రావడం సహజమని, దానిని బ్రేకప్ అంటూ పెద్దది చేయడం కరెక్ట్ కాదని ఆమె చెప్పకనే చెప్పింది.అయితే ఈ వివాదం వల్ల తనకు ఊహించని లాభం కూడా జరిగిందని రీతూ చెప్పింది. Anyway 1day lo 25k ppl started following me, Thank you అంటూ సెటైర్ వేస్తూనే థాంక్స్ చెప్పింది.నెగెటివ్ ప్రచారం వల్లే తన ఫాలోవర్స్ ఒక్కరోజులో 25 వేలు పెరిగారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్‌షిప్ తన ఇష్టమని దానిని జడ్జ్ చేసే హక్కు ఎవరికి లేదని ఆమె దీనిద్వారా క్లారిటీ ఇచ్చింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com