అతనితోనే నా పెళ్ళి... క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!
on Feb 14, 2026

బిగ్ బాస్ సీజన్ ఐపోగానే బిబి జోడి అంటూ బిబి ఉత్సవం అంటూ కొన్ని షోస్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బిబి జోడి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఉత్సవం రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. శ్రీముఖి తనూజని చూసి "ఈమె రన్నరప్ నేను రన్నరప్" అంటూ పాట పడింది. "శ్రీముఖి రన్నరప్ అంటే ఆడియన్స్ లో విన్నర్ అని అర్ధం" అంటూ రీతూ రన్నరప్ కి డెఫినిషన్ చెప్పింది. "అది ఎవరు చెప్తున్నారు టాప్ 5 లోకి రాని రీతూ చెప్తోంది" అంటూ ఆటపట్టించింది శ్రీముఖి. ఇక ప్రియా శెట్టి ఐతే "తన అందాన్ని చూసి అర్ధమయ్యి మూడో వారం మొత్తం నేను ఇమ్ము చుట్టూనే తిరిగాను నేను" అని చెప్పింది. "అందుకే మూడో వారమే వెళ్ళిపోయావు" అన్నాడు. "అవును వెళ్ళిపోయాను" అంది ప్రియా. "నా చుట్టూ తిరిగితే నా లేడీ ఫాన్స్ ఊరుకుంటారా" అంటూ ఇమ్ము అడిగాడు.
ఇక తర్వాత శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. రీతూను పిలిచి "ఎవరిని పెళ్లి చేసుకుంటావ్" అని అడిగింది శ్రీముఖి. "పవన్ కుమార్ ఉప్పల" అని చెప్పేసరికి డీమన్ పవన్ ముఖం వెలిగిపోయింది. వెంటనే వచ్చి ఇద్దరూ డ్యూయెట్ సాంగ్ కి డాన్స్ చేశారు. తర్వాత కళ్యాణ్ పడాల - తనూజ కలిసి డాన్స్ చేశారు. ఇక నాగార్జున ఎంట్రీకి ఎలివేషన్ ఇచ్చింది శ్రీముఖి. "ఆయన అడుగు పడకుండా అయన మాట వినబడకుండా కిక్కేముంటది" అంది. అందుకే ఆయనే సాక్షాత్తు ఈ ఉత్సవానికి రాబోతున్నారు" అంటూ చెప్పింది.
నాగార్జున ఎనర్జిటిక్ గా స్టేజి మీదకు వచ్చారు. "ఒక చిన్న గేమ్ ఆడదామనుకుంటా" అనేసరికి "ఒకే రెడీ అన్నారు". "వీకెండ్ ఎపిసోడ్స్ లో మీరు అందరితో ఆటలాడిస్తారు" అంది. "నేనెక్కడ ఆడానమ్మా వాళ్ళు ఆడారు నాతో ఆటలు" అన్నాడు నాగార్జున. ఇంతలో "నా పేరు హరి సర్. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ ని సర్ " అని చెప్పాడు. "రాసేసాడు ముందే" అంటూ నవ్వాడు నాగార్జున.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



