Home

»

Tv News

Brahmamudi: ఇందుపై రేఖ పెత్తనం.. గతాన్ని గుర్తుచేసుకుని ఉలిక్కిపడ్డ రాజు!

Mar 25, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'( Brahmamudi)ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -988 లో...అపర్ణ తన గ్రిప్ లో ఉందని నిరూపించుకోవడానికి రేఖ ప్రయత్నం చేస్తుంది. ఇందుని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. సాంబార్ కావాలనే కిందపడేసి ఇందు చెత క్లీన్ చేయిస్తుంది. అపర్ణకి కోపం వచ్చినా మళ్ళీ సుభాష్ ని ఏదైనా చేస్తుందేమోనని భయపడి సైలెంట్ గా ఉంటుంది‌. చూసావా వదిన ఆ అపర్ణ ఎలా కుక్కిన పెనులా ఉందోనని భ్రమరాంబతో రేఖ అంటుంది.

ఆ తర్వాత నందు బొకే షాప్ దగ్గరికి వెంకీ వస్తాడు. మీరు మొన్న పబ్ లో నాతో డాన్స్ చెయ్యడం నా గర్ల్ ఫ్రెండ్ చూసి వెళ్ళిపోయిందని వెంకీ అనగానే అసలు నీ గర్ల్ ఫ్రెండ్ పబ్ కి వచ్చిందా అని నందు అడుగుతుంది. వచ్చింది.. మా అన్నయ్య, తన ఫ్రెండ్ చెప్పారని వెంకీ చెప్తాడు. వాళ్ళు నీ చేత బిల్ కట్టించడానికి అలా చేసి ఉంటారని నందు అంటుంది. అదేం లేదు నా గర్ల్ ఫ్రెండ్ కి నేనంటే చాలా ఇష్టం.. నేను తాగిన కప్ లో తాగుతుంది.. నేను లంచ్ కి వెళ్ళేటప్పుడు నా వెనకాలే వస్తుందని వెంకీ చెప్తాడు. తన కప్ నీ కప్ పక్కన పెట్టి ఉంటారు. తనది అనుకొని తాగినట్లు ఉంది. ఇకపోతే లంచ్ టైమ్ అందరికి ఒకటేగా అని నందు అంటుంది‌. అలా అంటారా మీరే ఎలాగైనా నా గర్ల్ ఫ్రెండ్ నన్ను లవ్ చేస్తుందో లేదో తెలుసుకోవాలని వెంకీ రిక్వెస్ట్ చెయ్యడంతో నందు సరే అంటుంది. ఆ తర్వాత ఇందు దగ్గరికి స్వాతి వస్తుంది. ఏంటి అక్క ఏం జరగనట్లు అంత మాములుగా ఉన్నావ్. నిన్ను రేఖ ఆంటీ ఎంత అవమానించిందని స్వాతి అనగానే అలవాటు అయింది స్వాతి.. చిన్నప్పుడు కోపం వచ్చేది కానీ ఇప్పుడు అర్థం చేసుకొని వదిలేస్తున్నానని ఇందు చెప్తుంది. ఇలా ఎప్పటివరకు అక్క అని స్వాతి అనగానే తాతయ్య భాగయ్యే వరకు అని ఇందు చెప్తుంది. అప్పుడే ఇందుకి ఇంటర్వ్యూ ఉందని మెయిల్ వస్తుంది.

మరొకవైపు రాజు నిద్ర లో ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తాడు. ఏదో కార్ బ్లాస్ట్ అయినట్టు కల వచ్చిందని రాజు అనగానే అవి నీకు కామన్ కదా అని వాళ్ళ నాన్న అంటాడు. ఇవన్నీ మళ్ళీ తనకి గుర్తువస్తున్నాయంటే తన వాళ్లెవరో తనకి దగ్గర అవుతున్నారు కావచ్చని రాజు వెళ్ళిపోయాక రాజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో అంటుంది. మరొకవైపు ఐశ్వర్య కోసం రేఖ పదిలక్షల నెక్లెస్ తీసుకొని వస్తుంది. అది ఐశ్వర్య చూసి బాగుంది అంటుంది. ఆ తర్వాత ఇందు వచ్చి నేను శివరాం గారి ఇంటికి వెళ్తున్నానని రేఖకి చెప్పి వెళ్తుంది. దీన్ని నమ్మడానికి లేదని భ్రమరాంబ అనగానే లేదు వదిన శివరాం గారితో రోజు ఫోన్ లో మాట్లాడుతున్నాను.. ఇందు అక్కడికే వెళ్తుందని రేఖ అంటుంది. ఆ తర్వాత అన్ని నగలు ఐశ్వర్యకి కొంటుంది. రేపు ఆస్తుల విషయంలో నీ కూతురిని దూరం పెడుతుందని భ్రమరాంబతో తన భర్త అనగానే భ్రమరాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com