దొరబాబుకు వార్నింగ్ ఇచ్చిన రష్మీ
on Apr 15, 2025
జబర్దస్త్ లో రష్మీ మీద జోక్స్ మాత్రం ఆగడం లేదు. నెక్స్ట్ వీక్ ప్రోమోలో కూడా ఆమె మీద జోక్స్ పేలాయి. ఆటో రామ్ ప్రసాద్, దొరబాబు కలిసి వేసిన స్కిట్ రష్మీ కేంద్రంగా ఈ జోక్స్ బయటికొచ్చాయి. "నిన్న పంతులు గారి దగ్గరకు వెళ్ళావ్" ఎందుకురా అని దొరబాబు అడిగాడు ."జాతకం చూపించడానికి వెళ్లాను. ఆయన మందు మానెయ్ మందు మానెయ్ అన్నాడు మానేశా" అన్నాడు రామ్ ప్రసాద్. "రాత్రే కదా తాగావ్" అన్నాడు దొరబాబు. "పంతులు దగ్గరకు వెళ్లడం మానేశా" అన్నాడు రామ్ ప్రసాద్. "నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రష్మీ ఊళ్లోకొచ్చింది" అన్నాడు రామ్ ప్రసాద్. "నాకు తెలుసు లేరా..రాత్రి మా ఇంటికి వచ్చాకే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది" అన్నాడు దొరబాబు. ఇక రష్మీ వెంటనే దొరబాబుని చూసి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. "ఇంకా మానలేదా" అన్నాడు రామ్ ప్రసాద్".."నేనెక్కడా ఆపానని" అంటూ సిగ్గుపడిపోయాడు దొరబాబు.
ఇక ఫైమా- బులెట్ భాస్కర్ స్కిట్ విషయంలో రష్మీ ఒక కౌంటర్ డైలాగ్ వేసి అందరినీ నవ్వించింది. ఫైమా - భాస్కర్ కలిసి పెళ్లైనట్టుగా నటించారు. "ఏమండి మన పెళ్లి రోజు వచ్చింది కదా సినిమా చూపించండి..నేను హారర్ సినిమా చూస్తా" అంది. "ఐతే నీ ముందే ఉంది చూసుకో" అంటూ భాస్కర్ ని చూపించింది రష్మీ. దానికి ఫైమా కిలకిలా నవ్వేసింది. ఇక వర్షా - నాటీ నరేష్ ఇద్దరూ కలిసి స్కిట్ వేశారు. వర్షా ఐతే "ఏవండీ మనం ముగ్గురం కాబోతున్నాం" అని చెప్పేసరికి నరేష్ పాతికేళ్ళు అయ్యింది..ఈ బ్రేకింగ్ న్యూస్ విని..ఎన్ని శనివారాలు చూశానో" అంటూ తెగ ఎక్సైట్ అయ్యింది. ఐతే ఈ షోకి కొన్ని ఎపిసోడ్స్ నుంచి హీరోయిన్ లయ వస్తోంది. జడ్జెస్ శివాజీ, లయ ఇద్దరూ స్కిట్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
