.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో.. ప్రేమ జరిగింది మొత్తం నర్మదకి చెప్తుంది. దాంతో కంగారుగా నర్మద హాల్లోకి వచ్చి రామరాజుకి చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. నేను అన్యాయంగా జాబ్ తెచ్చుకున్నాను.. మరి చిన్నోడు చేసిందేంటి మాదక ద్రవ్యలు సప్లై చేస్తున్నాడంటా.. అది తప్పు కదా అని సాగర్ అంటాడు. అదేంట్రా అలా అంటున్నావని వేదవతి అంటుంది. తమ్ముడు స్టేషన్ లో ఉన్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఆయనకి చెప్తున్నానని సాగర్ అంటాడు.
నోరు ముయ్ రా వాడితో నీకు పోలిక ఏంటని సాగర్ పై రామరాజు కోప్పడతాడు. ఆ తర్వాత అందరు స్టేషన్ కు వెళ్తారు. అదృష్టం అంటే నీదేనే వల్లి.. ఇప్పుడు నర్మద, ప్రేమ ఏడుస్తూ ఉంటారు. నీ గురించి నీ కడుపు గురించి అసలు పట్టించుకోరని వల్లితో సుకన్య అనగానే వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రామరాజు వేదవతి, నర్మద చందు, తిరుపతి స్టేషన్ కి వెళ్తారు. ధీరజ్ ని చూసి వేదవతి ఎమోషనల్ అవుతుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న అని ధీరజ్ అంటుంటే నువ్వు నన్ను నమ్మించాల్సిన అవసరం లేదురా నువ్వు తప్పు చేయవని నాకు తెలుసని రామారాజు అంటాడు. అప్పుడే ఇన్‌స్పెక్టర్ వచ్చి అందరిని బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత రామరాజు లాయర్ ని పిలిపిస్తాడు. లాయర్ ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. బెయిల్ రాదు.. మీరు కోర్ట్ లో ట్రై చేసుకోండి అని ఇన్‌స్పెక్టర్ అంటాడు.
ఆ విషయం లాయర్ వచ్చి రామరాజుకి చెప్తాడు. ఇది ఎవరో ధీరజ్ పై కుట్ర చేశారు.. ఎందుకంటే అన్ని వెహికల్స్ ఉండగా వాడెవడో ధీరజ్ కార్ ఎందుకు ఎక్కాడు
.. ఆ రూట్ లోనే పోలీసులు ఎందుకున్నారు.. కార్ ఎక్కినవాడు వెళ్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు.. ఇదంతా కావాలనే చేశారని లాయర్ చెప్పగానే ప్రేమకి అర్థమై అక్కడ నుంచి వెళ్తుంది. మరొకవైపు ధీరజ్ అరెస్ట్ అవ్వడంతో సుకన్య, వల్లి ఇద్దరు భాగ్యం దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తారు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






