.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -474 లో..... ప్రేమని ధీరజ్ తీసుకొని వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తాడు. తనతో కేక్ కట్ చేయించి.. ఈ రోజు నుంచి మన కొత్తప్రయాణం మొదలవుతుందని అంటాడు. మరుసటిరోజు ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత సుకన్యని తిరుపతి ఎలా పడెయ్యాలో ఆలోచిస్తాడు. అప్పుడే ప్రేమ, ధీరజ్ వస్తారు. అల్లుడు నువ్వు మా అమ్మాయిని ఎలా పడేసావో చెప్పమని అడుగుతాడు.
ఏముంది మామ నేను తను అటుగా వెళ్తుంటే ఇలా కాలు అడ్డం పెట్టాను ఒడిలో పడిపోయిందని ధీరజ్ అనగానే ఒకసారి ఎలానో చూపించమని తిరుపతి అంటాడు. ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంటే ధీరజ్ తన కాలు అడ్డం పెడతాడు. ధీరజ్ ఒళ్ళో ప్రేమ పడిపోతుంది. ఇద్దరు అలాగే చూసుకుంటారు. అదంతా తిరుపతి చూసి సుకన్య వెళ్తుంటే కాలు అడ్డం పెడుతాడు. ప్లాన్ రివర్స్ అయి సుకన్య ఎత్తుకొని వెళ్తున్న బిందె తిరుపతిపై పడిపోతుంది. ఆ తర్వాత జరిగింది గుర్తుచేసుకొని విశ్వ కోపంగా ఉంటాడు. అమూల్య పై పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత అమూల్య కాలేజీకి టైమ్ అవుతుందని వేదవతి పిలుస్తుంది. అమూల్య భయంగా హాల్లోకి వస్తుంది. నాన్న నేను కాలేజీకి వెళ్ళను మానేస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. ఎందుకు అమూల్య, ఆ విశ్వ గాడు ఏమైనా అంటాడేమో అని భయపడుతున్నావా.. అలా ఏం ఆలోచించకు.. నీకు మేం తోడుగా ఉన్నామని ధీరజ్ అంటాడు. అవును అమ్మా.. నువ్వు ధైర్యంగా కాలేజీకీ వెళ్ళమని రామరాజు అంటాడు.
ఆ తర్వాత చందుతో అమూల్య కాలేజీకి వెళ్తుంది. కాసేపటికి రామరాజు ఇంటికి కొన్ని చెక్కబొమ్మలు తీసుకొని వస్తాడు. ఆ బొమ్మలు అన్ని జంటలుగా పెట్టి ఇవన్నీ బొమ్మలే కాదు.. మన కుటుంబమని వేదవతితో రామరాజు అంటాడు. నర్మద, వల్లి ఆ మాటలు వింటుంది. ఇప్పుడు వల్లి మన కుటుంబాన్ని పెద్దగా చేస్తుంది. ఆ తర్వాత నర్మద, ప్రేమ మన కుటుంబం పెద్దగా చేస్తారని రామరాజు అంటాడు. ఆ తర్వాత వల్లి అక్క నిన్ను వేరొక హాస్పిటల్ చూపించుకోవాలని అనుకుంటున్నామని నర్మద అంటుంది. అలా ఏం వద్దని వల్లి అంటుంది. ఎందుకు వద్దు.. నర్మద బాగా చదువుకుంది కదా.. తను పెద్ద హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుందని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
