Home

»

Tv News

Illu illalu pillalu : కన్నతండ్రిని నెట్టేసిన సాగర్.. చెంపచెల్లుమనిపించిన రామరాజు!

May 22, 2026 10:14AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -477 లో.....ప్రసాదరావు దగ్గరికి వెళ్లి భాగ్యం వాళ్ళు ఉన్నవి లేనివి కల్పించి చెప్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదరావు దగ్గరికి వెళ్లిన విషయం వల్లికి భాగ్యం చెప్తుంది. అమ్మ నువ్వు సూపర్ భలే చేసావని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ దెబ్బతో ఆ నర్మద, సాగర్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారని భాగ్యం అంటుంది. వెళ్తారు కానీ ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులే మంచిగా సెటిల్ అవుతారు. డబ్బు పోగు చేసుకుంటారు. అప్పుడు నువ్వు వాళ్ళని చూసి కుళ్ళుకుంటావని వల్లితో సుకన్య అంటుంది. అదేదో వాళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళ మధ్య లో గొడవలు పెట్టొచ్చని సుకన్య అంటుంది.

మరొకవైపు సాగర్ బ్యాగ్ తో వస్తాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని నర్మదతో అంటాడు. ప్రేమ, ధీరజ్ వచ్చి ఆపాలని ట్రై చేస్తారు. అయిన సాగర్ వినడు. అక్క నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళకు అక్క అని నర్మదని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. ఆయన వినట్లేదు ప్రేమ అని నర్మద ఏడుస్తుంది. అప్పుడే ఆగండి అంటూ లాయర్ ని తీసుకొని ప్రసాదరావు ఎంట్రీ ఇస్తాడు. నా కొడుకు ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని ప్రసాదరావుతో రామరాజు అంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సాగర్ అడ్డు వెళ్తే అతని చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. మళ్ళీ రామరాజుకి ప్రసాదరావుకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో రామరాజుని సాగర్ నెట్టేస్తాడు.. అతను కిందపడిపోతాడు. ఏంట్రా మీ నాన్నని తోసేస్తున్నావని వేదవతి కోప్పడుతుంది.

నాన్న నువ్వు మా కుటుంబం విషయంలో జోక్యం చేసుకోకు అని ప్రసాదరావుపై నర్మద కోప్పడుతుంది. నువ్వు ఎన్ని అన్నా సైలెంట్ ఎందుకు ఉంటున్నానో తెలుసా.. మా కుటుంబం ముక్కలు కాకుండా కాపాడాలనుకుంటున్నాను.. అందుకే నిన్ను ఏం చెయ్యలేకపోతున్నానని ప్రసాదరావుకి ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు నా అల్లుడికి రావల్సినవన్నీ రాసివ్వు అని రామరాజుని ప్రసాదరావు అడుగుతాడు. చిల్లి గవ్వ కూడా ఇవ్వనని రామరాజు అంటాడు. అందుకే లాయర్ ని తీసుకొని వచ్చానని ప్రసాదరావు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com