.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1035 లో.... రాజుకి రావలసిన డబ్బులో కండిషన్స్ బ్రేక్ చేసాడని అన్ని కట్ చేసి వేయి రూపాయలు చేతికి ఇస్తుంది ఇందు. దాంతో నేను ఏం కండిషన్స్ బ్రేక్ చేసానని రాజు అడుగుతాడు. దాంతో ఇందు అన్ని విషయలు గుర్తుచేసి మరి చెప్తుంది. దాంతో నాకు రావలసిన డబ్బు ఇలా చేస్తావా అని కోపంగా భోజనం చెయ్యనుపో అని రాజు అంటాడు. అదేంటీ భోజనం చెయ్యకపోతే నీరసం అవుతాడు. మళ్ళీ నాకే ఖర్చు అని ఇందు అనుకొని నువ్వు భోజనం చెయ్యకపోతే నేను కూడా చెయ్యనని ఇందు అంటుంది.
రాజు చెయ్ పట్టుకొని ఇందు తీసుకొని వెళ్తుంది. మరొకవైపు భోజనం చెయ్యడానికి రేఖ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. స్వాతి వచ్చి బావకి భోజనం గదిలోకి తీసుకొని రమ్మన్నాడని తీసుకొని వెళ్తుంది. దానికి బావ అంటే ఎంత ఇష్టమో అని భ్రమరాంబ అంటుంది. అందులో ఇష్టం ఏముంది వదిన.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారని రేఖ అంటుంది. నువ్వేమన్నా సరే నీ కొడుకే నా ఇంటికి అల్లుడు అని భ్రమరాంబ అనుకుంటుంది. ఆ తర్వాత రాజు, ఇందు భోజనానికి వస్తారు. ఇందుని కావాలనే రేఖ అక్కడ నుంచి పంపిస్తుంది. రాజు ని పేపర్స్ పై సంతకం పెట్టించడానికి ఒప్పించాలని అనుకుంటారు కానీ రాజు మాటతీరు చూసి షాక్ అవుతారు. ఏం జాబ్ చేస్తావని రాజుని రేఖ అడుగుతుంది. నాకు జాబ్ చెయ్యాలసిన అవసరమేంటి.. నాకు బిజినెస్ చేయాలని ఉంది.. ఇప్పుడు ఎలాగూ ఈ ఇంటికి అల్లుడిని కదా కంపెనీస్ మొత్తం నేనే చూసుకుంటాను.. డెవలప్ చేస్తానని రాజు అనగానే అందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత ఇందు వస్తుంది. భోజనం చేస్తారు. వాడి వాలకం చూస్తుంటే సంతకం పెట్టేలా లేడు అని రేఖతో భ్రమరాంబ అంటుంది. పెడతాడు, వాడికి డబ్బు అవసరం ఉండే ఇదంతా చేస్తున్నాడు.. అసలు వాడి గురించి కనుక్కోవాలని రేఖ అంటుంది. ఆ తర్వాత రాజేష్ డబ్బు కోసం ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. మీ ఆంటీని అడుగుతానని రాజేష్ అంటే వద్దని ఐశ్చర్య రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే ఇందు వచ్చి ఏంటని అడుగుతుంది. పది లక్షలు అప్పు తీసుకుందని ఇందుతో రాజేష్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

