.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-10లో.. వైజాగ్ లోని శబరి అనాధాశ్రమానికి రాజారాం వెళ్తాడు. అక్కడ జానకమ్మతో రాజారాం మాట్లాడతాడు. ఈ బ్యాంకు చెక్ తీసుకొని , దీని మీద ఎంతైనా అమౌంట్ రాసుకోండి.. అంజలికి మంచి లైఫ్ ని ఇప్పిచండి అని రాజారాం అంటాడు. అది విని జానకమ్మ బాధపడుతుంది. ఇరవై ఏళ్ళ క్రితం మీ కొడుకు ఏ తప్పు అయితే చేశాడో మీరు అదే తప్పు చేస్తున్నారని జానకమ్మ అంటుంది. నేను ఏం చేయలేను అమ్మ అని రాజారాం అంటాడు. తను చిన్నప్పటి నుండి అమ్మని కలవాలని ఎంతగానో పరితపిస్తోందంటూ అంజలి గతమంతా రాజారాంకి చెప్తుంది జానకమ్మ.
నా కూతురి కూతురు ఈ అంజలి.. నా కూతురు పెళ్ళి కాకముందే ఒకడిని ప్రేమించి తల్లి అయింది.. ఇప్పుడేమో తనకి మరోపెళ్ళి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాజంలో పెద్ద పలుకుబడి ఉంది.. ఇలాంటి టైమ్ లో అంజలిని తీసుకెళ్తే అక్కడ చాలామంది ప్రాణాలు గాలిలో దీపాలు అవుతాయని రాజారాం అంటాడు. మరి ఇప్పుడు ఏం అంటారు.. తనని తీసుకెళ్ళనని అంటారా అని జానకమ్మ అడుగుతుంది. లేదు.. అక్కడికి తీసుకెళ్ళలేనని చెప్పి రాజారాం వెళ్తుంటే అప్పుడే అంజలి వస్తుంది. తను టెన్షన్ పడి ఏమైంది తాతగారు అని అడుగుతుంది. కార్ లో ట్యాబ్లెట్స్ ఉన్నాయని రాజారాం అనగానే అంజలి పరుగున వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తుంది. ఇక రాజారాం అవి వేసుకొని నార్మల్ అవుతాడు. ఆ తర్వాత రాజారాం వెళ్తానని జానకమ్మతో చెప్పగానే నాకు ఏదో ఒక సమాధానం చెప్పండి అని ఆమె అనగానే సరేనని రాజారాం అక్కడి నుండి వచ్చేస్తాడు.
మరోవైపు మనీష్ తో గీతాంజలి మాట్లాడుతుంది. మా నాన్న ఏదో దాస్తున్నాడు.. నా గురించి టెన్షన్ పడుతున్నట్టు నాకు అనిపిస్తుందని గీతాంజలి అనగానే అదేం లేదు అత్తయ్య అని మనీష్ అంటాడు. మరోవైపు రాజారాం టెన్షన్ పడుతుంటాడు. ఇక అనాధాశ్రమంలో ఉన్న చిన్నపాపని కూడా ఒక ఫ్యామిలీకి అప్పజెప్తుంది జానకమ్మ. ఆ పాప వెళ్ళిపోతుంటే అంజలి, జానకమ్మ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
