.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1041 లో....రేఖ దగ్గరికి ఇందు వచ్చి.. ఆంటీ ఆ రాజు గాడు సీఈఓగా పోటీ చెయ్యాలని అనుకుంటున్నాడు.. వాడు అనుకున్నది చేసి బోర్డు మెంబర్స్ ని తన వైపుకి తిప్పుకుంటాడని ఇందు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ మాటలన్నీ రాజు విని ప్లాన్ చేసింది నువ్వు ఇప్పుడు తన ముందు నన్ను ఇరికిస్తావా నీ సంగతి చెప్తానని రాజు అనుకుంటాడు.
ఆ తర్వాత వెంకీ ఆఫీస్ కి వెళ్తాడు. నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తున్నాను.. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వడం లేదని మేనేజర్ అనగానే సర్ నేను నిజాయితీగా పనిచేస్తున్నాను కదా అని వెంకీ అనగానే కావలసింది నిజాయితీ కాదు అప్డేట్ అవ్వాలి.. పాతకాలం లాగా అక్కడే ఉంటానంటే కుదరదని మేనేజర్ వెంకీకి చెప్తాడు. దానికి వెంకి రిక్వెస్ట్ చేస్తాడు. అయిన మేనేజర్ వినడు. మరొకవైపు రాజు భోజనం చేస్తాడు. చికెన్ లో పెరుగు కలుపుకొని తింటాడు.అది చూసి అపర్ణ తన కొడుకు రాజ్ అలాగే తినేవాడని గతంలో జరిగింది గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఏంటి అమ్మమ్మ అలా ఉన్నావని రాజు అడుగుతాడు. మా అబ్బాయి కూడా అచ్ఛం ఇలాగే తినేవాడని అపర్ణ అంటుంది. ఏంటి ఆంటీ తనలో నీ కొడుకుని చూసి మురిసిపోతున్నావా అని అపర్ణతో రేఖ అంటుంది.
ఆ తర్వాత రాజు నువ్వు సీఈఓగా పోటీ చేస్తున్నావంట అందుకోసం బోర్డు మెంబర్స్ తో మాట్లాడావట అని రేఖ అడుగుతుంది. అవునని రాజు చెప్తాడు. ట్రై చెయ్ అని రేఖ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వెంకి ఇంటికి వెళ్లి నా జాబ్ పోయిందని చెప్పగానే వాళ్ళ అమ్మనాన్న బాధపడతారు. ఇక మనం ఎలా బతుకుతామోనని చలపతి టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

