Brahmamudi : రాజ్, కావ్య వేసిన డిజైన్స్ సొంతం చేసుకున్న రాహుల్.. కేరళలో వాళ్ళిద్దరు!
on Dec 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -895 లో.....ఈ కేసుని ఎలాగైనా వారం రోజుల్లోగా క్లోజ్ చేసి.. అత్తయ్య మెచ్చిన కోడలిగా ఇంట్లోనే ఉండాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. అప్పు, రేణుక ఇంటికి వెళ్తుంది. నా పాప కన్పించిందని చెప్తే ఎవరు నమ్మడం లేదని రేణుక చెప్తుంది. నా భార్య భ్రమలో ఉంది మేడమ్ అని రేణుక భర్త చెప్తాడు. అవన్నీ మేమ్ చూసుకుంటామని అప్పు అంటుంది. అప్పు అక్కడ చుట్టూ పక్కనున్న వాళ్ళని ఎంక్వయిరీ చేస్తుంది.
మరొకవైపు రాజ్, కావ్య కేరళకి వెళ్తారు. అక్కడ ఒకతను వాళ్లని రిసీవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ రాజ్ కంపెనీ నుండి డిజైన్స్ తీసుకొని వచ్చి రాహుల్ కి ఇస్తాడు. సూపర్ అసలు ఇలా చేస్తావని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదని రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ కంపెనీలో తెలిసిన వాళ్ళని డబ్బుతో కొన్నానని మేనేజర్ చెప్తాడు. మరొకవైపు రాజ్, కావ్య స్వామి దగ్గరికి వెళ్లి కావ్య రిపోర్ట్స్ చూపిస్తారు. అవి చూసి నయం అవుతుందని చెప్తాడు. కావ్యకి ఆయుర్వేద వైద్యం చేస్తాడు.
ఆ తర్వాత కొన్ని రోజులు ఇక్కడే ఉండండి వైద్యం చేస్తాను. మీరు బస చేస్తున్న దగ్గర నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్తాడు. మందులు, తైలం ఎప్పుడు వాడాలో అన్ని చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య అక్కడ నుండి బయల్దేరతారు. చాలా హ్యాపీగా ఉంది పంతులుగారు మనకి మంచి మార్గం చూపారు.. ఇక నీకు మన బిడ్డకి ఏం కాదని రాజ్ మురిసిపోతాడు. ఎవరో ఒకతన్ని రౌడీలు తరుముతుంటే అతను రాజ్, కావ్య కారుకి ఎదురుగా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



