Brahmamudi: రాజు, ఇందు దొంగ పెళ్లి బయటపెట్టిన లక్కీ.. నిజమైన పెళ్లికి అపర్ణ రెడీ!
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1174 లో.....వెంకీని జైల్లో నుంచి విడిపించి ఇంట్లో వదిలి వెళ్తుంది నందు. వెంకీ థ్యాంక్స్ చెప్తే నందు ప్రేమ విషయం దాచావని తిడుతుంది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం నాకు రాదని చెప్పి వెళ్లిపోతుంది. అటు చలపతికి లక్ష్మీ క్లాస్ పీకుతుంది. నందుకు థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. చలపతి ఎమోషనల్ అయి ఒకప్పుడు నందును ఇంటికి రావద్దన్నాను.. ఇప్పుడు మంచివాడిలా నటించలేకపోయానని కంటతడి పెడతాడు. మరోవైపు రాజు, ఇందు ఇంటికి వచ్చి ఐశ్వర్య బండారం బయటపెడతారు. వెంకీని నువ్వే అరెస్ట్ చేయించావని పేపర్లు విసిరేస్తాడు రాజు.
లక్కీ అడ్డుపడి ఆడాళ్ల మీద పేపర్లు విసురుతావా అని రాజుని మందలిస్తాడు. ఏం చేసిందో తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నావా అని ఇందు అంటుంది. మా ఐషూ ఏం చేయలేదని భ్రమరాంబ అంటుంది. అప్పుడే నందు వచ్చి వీడియో చూపిస్తుంది. అందులో ఐశ్వర్యతో మేనేజర్ డీల్ చేసి వెంకీని ఇరికించాలని చెప్పడం చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే డీలర్ వచ్చి నకిలీ బంగారంతో మోసం చేసింది.. అరెస్ట్ చేయండి అని అంటాడు. ఐశ్వర్యకు నందు సంకెళ్లు వేయబోతే ఇందు అడ్డుపడుతుంది. దుగ్గిరాల పరువు, స్వరాజ్ గ్రూప్ పేరు పోతుందని అంటుంది.
ఇందు డీలర్ కు మీరు కోట్ చేసిన మొత్తంలోనే ఆర్డర్ ఇస్తాను. కేసు వెనక్కి తీసుకోండి అని హామీ ఇస్తుంది. దాంతో డీలర్ వెళ్లిపోతాడు. అపర్ణ ఎందుకు కాపాడావని ఇందుని తిడుతుంది. ఐశ్వర్యకు ఇందు లాస్ట్ వార్నింగ్ ఇస్తుంది, మళ్లీ చేస్తే తాట తీస్తా, ఇంట్లో ఉండవని అంటుంది. ఐశ్వర్య ఎదురు తిరిగి నువ్వు కాపాడావా, కాళ్ల దగ్గర పడి ఉండాలా, ఆస్తి కోసం నటిస్తున్నావని అంటుంది. ఇందుని కొట్టబోతే రాజు చేయి లేపుతాడు. లక్కీ అడ్డుపడి ఆమె నా భార్య అని అంటాడు. తల్లి ఎవరో తెలియక రోడ్డున పడిన నిన్ను నేను తీసుకొచ్చానని రాజు అంటే నువ్వు దొంగ మొగుడివి, అద్దె మొగుడివి, నేనే అసలైన అల్లుడిని అని లక్కీ అంటాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
