.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1167 లో ఐశ్వర్యకీ కాంట్రాక్ట్ రావడం, రాజు, ఇందు చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకోవడం ఒకేసారి జరుగుతుందని ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. ఐషు మాటలకు అపర్ణ కోప్పడుతుంది. తన మనవరాలికి, మనవడికి అలాంటి గతి పట్టదని స్ట్రాంగ్ గా చెప్తుంది.
అదే టైమ్ లో లక్కీ ఐషును కాకా పట్టే పనిలో ఉంటాడు. టిఫిన్ వడ్డించడం, చట్నీలు వేయడం, టిఫిన్ తిన్నాక చేయి కడగడం, కడిగిన చేయి తుడుచుకోవడానికి తన షర్ట్ చూపించడం లాంటివి చేస్తుంటాడు. ఇందు, రాజు ఆఫీసుకు టైమ్ అవుతుందని వెళ్లిపోతారు. శేషు వెటకారంగా అరేయ్ లక్కీ నిన్ను చూస్తుంటే నాకో విషయం గుర్తుకువస్తుందని అంటే, ఏంటి అంకుల్ నన్ను చూస్తుంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుందా అంటాడు లక్కీ. దానికి భ్రమరాంబ కోప్పడటంతో లక్కీ సైలెంట్ గా వెళ్లిపోతాడు.
ఆఫీసులో కొత్త డిజైనర్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు రాజు, ఇందు. డిజైనర్ జాబ్ కోసం అమ్మాయి వస్తే తనతో క్లోజ్ గా మూవ్ అయి ఇందు మనసులో మాట బయటకు చెప్పేలా చేయాలని రాజు ప్లాన్ చేస్తాడు. అందుకోసం యంగ్ టాలెంట్ ఉన్నవాళ్లకే జాబ్ ఇవ్వాలని చెప్తాడు. కానీ ఇంటర్వ్యూకు అమ్మాయి కాకుండా అబ్బాయి వస్తాడు. తనను తాను ప్రశాంత్ గా పరిచయం చేసుకుని తన మాటలతో ఇందును ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. దీంతో రాజు షాక్ అయి కోపంగా ప్రశాంత్ ను తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇందు నవ్వుకుంటూ ఇక్కడ ఏదో కాలిన వాసన వస్తుందా అంటూ రాజును ఆటపట్టిస్తుంది.
మరోవైపు లక్కీ ఐశ్వర్య కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేయించి ఆఫీసుకు తీసుకెళ్తాడు. ఒక భర్తగా లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నానని చెప్పడంతో రేఖ, భ్రమరాంబ నవ్వుతారు. కానీ ఆఫీసులో ఉన్న ఐశ్వర్య లక్కీని తిట్టి వెళ్లగొడుతుంది. ఇందును ఇంప్రెస్ చేయడానికి రాజు ఇష్టమైన వంటకాన్ని ఆర్డర్ చేస్తే, ఇందు మాత్రం రాజును ఏడిపించాలని ప్రశాంత్ తీసుకొచ్చిన బాక్స్ తింటుంది. రాజు కోపంగా ఆ పార్శిల్ ఓపెన్ చేసి తింటూ వాహ్ సూపర్ అంటాడు. ఇందు మనసులో చప్పిడి కూరలు తినాల్సి వచ్చిందని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
