Home

»

Tv News

10 ఏళ్లుగా సాగిన నా ప్రయాణం.. : ప్రియాంక సింగ్

Oct 6, 2026 12:56PM

బుల్లితెర మీద ప్రియాంక సింగ్ అంటే తెలియని వారు ఉండరు. ఐతే ప్రియాంక సింగ్ అసలు పేరు సాయి తేజ. ఐతే తానూ కోరుకున్న అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు సాయి తేజ. అలా ఎంతో కష్టపడి సర్జరీ చేయించి అందమైన ప్రియాంక సింగ్ గా మారింది. ఆ మార్పుకు ఈరోజుతో పదేళ్లు. ఆ ప్రయాణాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందులో ఎం చెప్పిందంటే..

‘‘దేవుడా.. ఈ రోజు నా ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీకి పదేళ్లు పూర్తయ్యాయంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రియాంక సింగ్‌గా ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు  ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో ఎదుర్కొన్న బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, అయోమయం.. అన్నీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ‘నేను ఏం చేయాలి? నేను నిజంగా ఎవరో, అలాంటి వ్యక్తిగా ఎలా మారాలి?’ అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అయితే నాకు ఒక్క విషయం  తెలుసు. నేను ఎప్పుడూ నా మనసులో భావించిన మహిళగా, ప్రియాంక సింగ్‌గా జీవించాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఎన్నో అధ్యాయాలు కనిపిస్తున్నాయి. ఒంటరితనంతో గడిచిన సంవత్సరాలు ఉన్నాయి. సంతోషంగా గడిచిన రోజులు ఉన్నాయి. ఎన్నో భావోద్వేగ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కెరీర్‌లో  విజయాలు చూశాను.  ఇన్నేళ్లల్లో  ఒక్కరోజు కూడా పని చేయని పరిస్థితిని కూడా చూసాను. ఈ ప్రయాణంలో పరిస్థితులు  చాలా మారిపోయాయి. వాటితో పాటు  నేను మారాను. నా జీవితం కూడా మారింది. కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా నేను మాత్రం నన్ను నేను వదులుకోలేదు. ఈ రోజు అద్దంలో నన్ను నేను చూసుకుని ‘నేను సాధించాను’ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నా పదేళ్ల ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని పూర్తి చేశాను. అన్నింటికంటే ముఖ్యంగా.. నేను మారిన మహిళ గురించి నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎవరినీ కావాలని బాధపెట్టకుండా నా జీవితాన్ని నేను ఏర్పాటు చేసుకున్నందుకు  గర్వపడుతున్నాను. ఈ రోజు ప్రశాంతంగా, సంతోషంగా, నా ఇష్టానుసారం జీవించగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా  ఉంది. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.  నేను ఎదుర్కొన్న ప్రతి కష్టమైన క్షణం.. నేను ఎప్పటినుంచో కావాలనుకున్న వ్యక్తిగా మారేందుకు నన్ను మరింత దగ్గర చేసింది. ఈ అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు, ముందుకు సాగేందుకు నాకు బలాన్ని ఇచ్చినందుకు, చివరకు ‘నేను’గా మారేందుకు అవకాశం ఇచ్చినందుకు ఈ యూనివర్స్‌కు ధన్యవాదాలు.


నా జీవితంలో పదేళ్లుగా సాగిన  ప్రయాణానికి ఇది ఒక సెలబ్రేషన్. ఈ రోజు నేను ఉన్న మహిళగా మారేందుకు నడిచిన ఆ పదేళ్ల ప్రయాణానికి హ్యాపీ 10 ఇయర్స్.
పదేళ్ల క్రితం ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ అమ్మాయిని అంటే నన్ను చూసి ఈ రోజు నాకు నేను ఒక్కటే చెప్పుకుంటున్నా " నాకు చాలా గర్వంగా ఉంది. మనం సాధించాం.’’అని. అక్టోబర్ 5 తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని తనను తాను మార్చుకునే ప్రయాణాన్ని ప్రారంభించి నేటికి పదేళ్లు పూర్తయ్యాయని చెబుతూ సోషల్ మీడియాలో ఈ  భావోద్వేగ పోస్టు పెట్టింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com