Home

»

Tv News

గుర్రంపై ప్రియాంక జైన్ రైడ్.. సోషల్ మీడియా షేక్!

Sep 25, 2026 2:31PM

బుల్లితెరపై తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ మరోసారి తన లేటెస్ట్ ఫోటోషూట్ తో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో  ఆమె షేర్ చేసిన రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పచ్చని బయలు, ఓపెన్ నేచర్ లో తెల్ల గుర్రంపై రైడ్ చేస్తూ చేసిన ఈ ఫోటోషూట్ కు "Just horsin' around in my wild era 🐎✨" అని క్యాప్షన్ పెట్టింది.

ఈ వీడియోలో ప్రియాంక లెపర్డ్ ప్రింట్ ఉన్న మోడ్రన్ డ్రెస్ లో చాలా బోల్డ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తోంది. పొడవైన వదిలేసిన జుట్టు, లైట్ మేకప్, డిజైనర్ ఇయర్ రింగ్స్ తో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంది. గుర్రంపై కూర్చొని ఇచ్చిన రకరకాల పోజులు, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ రీల్ తో ప్రియాంక జైన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ప్రియాంక జైన్ అంటేనే గ్లామర్ కు కేరాఫ్. మౌని రాయ్ సీరియల్ తో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత వరుస సీరియల్స్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ లైఫ్, ఫ్యాషన్ టిప్స్, ట్రావెల్ వీడియోస్, ఫోటోషూట్స్ తో ఎప్పుడూ ఫాలోవర్స్ ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.

తాజా వైల్డ్ ఎరా ఫోటోషూట్ తో మరోసారి తనలోని మోడల్ యాంగిల్ ను బయటపెట్టింది ప్రియాంక. గుర్రంతో ఇలా ఫోటోషూట్ చేయడం అనేది చాలా రేర్ గా కనిపిస్తుంది. అందుకే ఈ లుక్ కు నెటిజన్ల నుంచి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. "క్వీన్ లుక్", "బ్యూటిఫుల్" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. ఈ ఫోటోషూట్ తో మరోసారి ప్రియాంక జైన్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిందని చెప్పొచ్చు.

 

 

 

[Priyanka Jain, Priyanka Jain Photoshoot, Priyanka Jain Instagram, Priyanka Jain Horse Ride, Priyanka Jain Wild Era, Priyanka Jain Viral Reel, Telugu Television, Priyanka Jain Fashion, Priyanka Jain Glamour Look, Mouni Roy Serial]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com