.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఎనిమిదో వారం మొదలైంది. అయితే ఏడో వారంలో జరిగిన సాండ్ బ్యాగ్స్ లగేజ్ టాస్క్ ఇప్పుడు బయట పెద్ద దుమారమే రేపుతోంది. ఈ టాస్క్‌లో ముఖేష్ ప్రవర్తనపై మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ సంచలన కామెంట్స్ చేసింది. ఏడో వారం టాస్క్‌లో భాగంగా బరువులు వేసే గేమ్‌లో శివ్ ముఖేష్‌కు బ్యాగ్స్ వేసినప్పుడు ముఖేష్ నయ్ నయ్ అంటూ గొడవ చేశాడు. కానీ అదే టాస్క్‌లో త్రిగుణ్ వచ్చి సేమ్ బ్యాగ్స్ వేస్తే అసలు మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. ఈ డబుల్ స్టాండర్డ్ బిహేవియర్‌పై ప్రియాంక జైన్ మండిపడింది.
శివ్ నీకు రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్నాడు, నువ్వేమో ఇష్టమొచ్చినట్లు సిగ్గులేదా అని తిట్టావంటూ ముఖేష్‌పై ప్రియాంక ఫైర్ అయింది. ఒక సోషల్ మీడియా వీడియోలో మాట్లాడుతూ, ముఖేష్ వాడిన పదజాలం చాలా తప్పని ఆమె అన్నారు. అసలు నిజానికి ముఖేష్‌కు తెలుగు మాట్లాడటం ప్రాబ్లమ్ ఉందని, అతనికి సిగ్గులేదా అనే పదం పెద్ద వర్డ్ కాదేమో కానీ, తెలుగు మాట్లాడే వారికి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే వారికి అది చాలా పెద్ద తప్పు అని ప్రియాంక వివరించింది. చాలా మాటలు ముఖేష్ నోరు జారుతున్నాడని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె హెచ్చరించింది.
ప్రియాంక జైన్ చేసిన ఈ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. శివ్ కోసం రంగంలోకి దిగిన ప్రియాంక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖేష్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచి తన మాట తీరుతో చాలా సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో కొన్నిసార్లు తప్పుగా మాట్లాడుతున్నాడని కొందరు సమర్థించినా, మరికొందరు మాత్రం కావాలనే ఇలా మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏడో వారం లగేజ్ టాస్క్‌లో శివ్ పట్ల చూపిన ప్రవర్తనతో మరోసారి నెగెటివ్ అయ్యాడు.మొత్తానికి బిగ్ బాస్ 10 హౌస్‌లో ముఖేష్, శివ్, త్రిగుణ్ మధ్య జరుగుతున్న గొడవలు రోజురోజుకీ ముదురుతున్నాయి. ఏడో వారం టాస్క్ తర్వాత హౌస్‌లో గ్రూప్ గేమ్ మరింత పెరిగింది. బయట ఉన్న మాజీ కంటెస్టెంట్స్ కూడా లోపల జరుగుతున్న వాటిపై రియాక్ట్ అవుతుండటంతో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. మరి ముఖేష్ తన మాట తీరును మార్చుకుంటాడా, లేక ఇదే తీరుతో ఆడియన్స్ నుంచి నెగెటివిటీ మూటగట్టుకుంటాడా అనేది చూడాలి.




.webp)
.webp)
