Home

»

Tv News

 గాయంతో బెడ్ పై ఆర్టిస్ట్ ప్రియా.. త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్!

Sep 28, 2026 10:49AM

బుల్లితెర నటి, ఇన్‌స్టా స్టార్ ప్రియా ఆర్టిస్ట్ ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. కాలికి గాయం కావడంతో పింక్ కలర్ ప్లాస్టర్ వేసుకుని ఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నీలం రంగు దుప్పటి కప్పుకుని, వేడి వేడి సూప్ తాగుతూ బెడ్ పై ఉన్న ఆ ఫోటోలో ఆమె కాలికి వేసిన బ్రైట్ పింక్ కాస్ట్ హైలైట్ గా నిలిచింది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 ఆ ఫోటోకి ప్రియా ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది. అధికారికంగా బెడ్ రెస్ట్ లో ఉన్నా.. వేడి సూప్ తో, బ్రైట్ పింక్ కాస్ట్ తో రెస్ట్ తీసుకుంటున్నా. మీ ప్రేమను, పాజిటివ్ వైబ్స్ ను పంపండి. కాలు నయం అయ్యే వరకు మైండ్ బిజీగా ఉండటానికి ఏదైనా మంచి హాబీ ఐడియాలు ఉంటే చెప్పండి. మీ ప్రార్థనలు కూడా కావాలి.. థాంక్యూ, లవ్ యూ ఆల్ అంటూ రాసుకొచ్చింది. అంటే ఖాళీగా ఉండలేక ఏదైనా కూర్చుని చేసుకునే హాబీలు చెప్పమని ఫ్యాన్స్ ని అడిగింది. ఈ పోస్ట్ పెట్టిన రెండు రోజుల్లోనే 3 వేలకు పైగా లైక్స్, 240 కి పైగా కామెంట్స్ వచ్చాయి. ఫ్యాన్స్ అంతా "త్వరగా కోలుకో ప్రియా", "జాగ్రత్త" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు పుస్తకాలు చదవమని, పెయింటింగ్ వేయమని, మ్యూజిక్ వినమని, వెబ్ సిరీస్ లు చూడమని సలహాలు ఇస్తున్నారు. అసలు గాయం ఎలా అయిందో ప్రియా చెప్పకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఆమె త్వరగా లేచి మళ్లీ డ్యాన్స్ వీడియోలు చేయాలని కోరుకుంటున్నారు.

ఎప్పుడూ యాక్టివ్ గా డ్యాన్స్ లు, ఫన్నీ రీల్స్ తో అలరించే ప్రియా ఇలా బెడ్ పై ఉండటం చూసి ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. అయినా పింక్ కాస్ట్ లో కూడా చాలా క్యూట్ గా ఉన్నావంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా రెస్ట్ తీసుకుంటోంది. త్వరలోనే కోలుకుని మళ్లీ ఎప్పటిలాగే వీడియోలతో వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com