పృథ్వీ ఎలిమినేషన్ కన్ఫమ్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!
on Nov 30, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీకెండ్ వచ్చేసింది. అదే బిగ్ బాస్ క్లైమాక్స్ కి వచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ తరుణంలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.
ఈ వారం నామినేషన్స్‌లో రోహిణి తప్ప హౌస్ మొత్తం ఉన్నారు. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో టికెట్ టు ఫినాలేని అవినాష్ ని గెలిచాడు. కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు కంటెస్టెంట్స్ మధ్య సాగుతున్న ఈ సీజన్-8 ఎలిమినేషన్స్ లో గతవారం యష్మీ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం మాత్రం తెలుగు కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతాడా లేక బిగ్ బాస్ బయాజ్డ్ గా ఉంటూ పృథ్వీని సేవ్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిఖిల్, నబీల్, గౌతమ్ టాప్-3 లో ఉన్నారు. ప్రేరణ నాల్గో స్థానంలో ఉంది. ఇక డేంజర్ జోన్ లో టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ ఉన్నారు. అయితే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అవినాష్, టేస్టీ తేజ, రోహిణిలు టాస్క్ లలో కూడా దుమ్ములేపుతున్నారు.
బిగ్ బాస్ సీజన్-8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేదాకా సప్పగా సాగింది. ఎప్పుడూ అయితే వైల్డ్ కార్డ్ లు వచ్చారో ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేదు. ముఖ్యంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ కామెడీతో తెగ నవ్వించేశారు. కానీ ఇలా రియల్ గా జెన్యున్ గా ఉండే వారికే ఓటింగ్ లేదు. జనాలు కామెడీ చేసే వాళ్ళని విజేతలు చేయ్యరని రోహిణి, తేజ మాట్లాడుకున్నారు. వారిని చూసి ఆడియన్స్ లో కూడా మార్పు వచ్చింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే పృథ్వీతో పాటు టేస్టీ తేజ ఎలిమినేషన్ అవుతారు. అలా కాకుండా సింగిల్ ఎలిమినేషన్ అయితే లీస్ట్ లో ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడు. విష్ణుప్రియ-పృథ్వీల లవ్ ట్రాక్ నడిపించాలని బిగ్ బాస్ చూస్తే పృథ్వీని సేవ్ చేసి తేజని ఎలిమినేషన్ చేస్తారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read