Illu illalu pillalu : ప్రేమకి సారీ చెప్పిన ధీరజ్.. అమూల్య నిశ్చితార్థం జరుగుతుందా!
on Jan 14, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో...... ధీరజ్ టీ షర్ట్ పై DP అని లవ్ సింబల్ వెయ్యడంతో అందరు తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులని రామరాజు పిలుస్తాడు. నిశ్చితార్థంలో ఎలాంటి లోపాలు జరగద్దు.. ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా చందు, శ్రీవల్లి చూసుకోండి.. ఎంగేజ్ మెంట్ రింగ్స్ మీరు తీసుకొని రండి అని ధీరజ్, ప్రేమలకి రామరాజు చెప్తాడు. దాంతో ధీరజ్ కి ఇష్టం లేకున్నా
సరే అంటాడు.
అ తర్వాత ఒరేయ్ సాగర్ మొన్న సేట్ కి డబ్బులు ఇవ్వమంటే ఒక లక్ష అపావంట ఎందుకని రామరాజు అడుగుతాడు. సాగర్ టెన్షన్ పడుతాడు. అప్పుడే వేదవతి వచ్చి వాడిని అలా అడుగుతారు ఏంటని టాపిక్ డైవర్ట్ చెస్తుంది. అమూల్యకి పెళ్లి ఇష్టం లేనట్లుందని రామరాజుతో వేదవతి అంటుంది. అదేం లేదు.. తను నా కూతురు అని రామరాజు చాలా నమ్మకంగా చెప్తాడు. అ తర్వాత సాగర్ టెన్షన్ పడుతుంటే.. ఏమైందని నర్మద అడుగుతుంది. నా ఫ్రెండ్ కి అర్జంట్ అని డబ్బు ఇచ్చానని సాగర్ అంటాడు. ఆ విషయం మరి మావయ్యకి చెప్పాలి కదా అర్జెంట్ గా వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చేయమని నర్మద అనగానే నాన్న వేరే పని చెప్పాడు కదా ఇప్పుడు ఎలా అని సాగర్ అంటాడు. సరే ఈ పని అయ్యాక వెళ్ళు అని నర్మద అంటుంది. హమ్మయ్య తప్పించుకున్నానని సాగర్ అనుకుంటాడు.
అ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. ఏంటె.. నా టీ షర్ట్ పై ఎందుకు అలా రాసావని కోప్పడతాడు. నువ్వు మన పేర్లు పేపర్ పై రాస్తే చింపేశావ్.. కానీ మనల్ని ఎవరు వేరు చేయలేరని చెప్పడానికి అలా చేశానని ప్రేమ అంటుంది.అ తర్వాత నాన్న మనల్ని బయటకు వెళ్లి రింగ్స్ తీసుకొని రమ్మన్నారని ధీరజ్ అనగానే నాకు సారీ చెప్తేనే వస్తానని ప్రేమ అంటుంది. ధీరజ్ కి వేరే ఆప్షన్ లేక ప్రేమకి సారీ చెప్తాడు. ఇద్దరు కలిసి గోల్డ్ షాప్ కి బయల్దేరతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



