Home

»

Tv News

పూజ హెగ్డేకు అల్లు అర్జున్ ఫోన్.. అల వైకుంఠపురములో డైలాగ్‌తో స్పెషల్ టచ్

Oct 28, 2026 11:46AM

జయమ్ము నిశ్చయమ్మురా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి పూజ హెగ్డే వచ్చింది. పూజ హెగ్డే అంటే బుట్ట బొమ్మ సాంగ్ గుర్తొస్తుంది. ఈ సాంగ్ ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటి పూజ హెగ్డే లేటెస్ట్ గా ఈ షోకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ కూడా ఆమెతో మాట్లాడారు. "బుట్టబొమ్మ అని పిలవాలా అరవిందా అని పిలవాలా " అని అడిగారు జగపతి బాబు. దాంతో షోకి వచ్చిన ఆడియన్స్ అంతా బుట్ట బొమ్మ అని చెప్పేసరికి పూజ హెగ్డే కూడా బుట్ట బొమ్మ అని పిలవమని చెప్పింది.

ఎప్పుడూ మీ కళ్ళజోడు మారుస్తున్నారా అని అడిగింది పూజ. వెంటనే జగపతి బాబు నీ డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని పెట్టుకున్నా అని చెప్పేసరికి నవ్వేసింది. "పాండాలో స్టాపర్స్ కాఫీ షాప్ ఉంది కదా నీ లైఫ్ ని మార్చేసిందంట ఎలా " అని అడిగాడు. "నేను ఒక డౌట్ లో ఉన్నాను " అంది పూజా ఇంతలో మరో వైపు నుంచి హరీష్ శంకర్ వచ్చాడు. "వక్కపొడి తెగ తినేవాడివి కదా " అన్నారు జేబీ. "పూజ ఉన్నప్పుడు తినేవాడిని ఎక్కువ టెన్షన్ ఉండేది " అని చెప్పాడు. ఇంతలో అల్లు అర్జున్ ఫోన్ చేసి " హాయ్ పూజా ..మేడం సర్ మేడం అంతే " అంటూ అల వైకుంఠపురంలోని డైలాగ్ చెప్పాడు. దాంతో పూజ నవ్వేసింది.

ఇక పూజ హెగ్డే చేసిన సినిమాలు చాలా హిట్స్ ఉన్నాయి. ఒక లైలా కోసం, ముకుంద, దువ్వాడ జగన్నాధం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, ఆచార్య వంటి మూవీస్ లో నటించింది. ఐతే పూజ 2022 తర్వాత మళ్ళీ మూవీస్ లో కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ షోలో కనిపించింది.
-------------------

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com