
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-83 లో......మహాని స్టేషన్ లో పెళ్లి చేసుకున్న ఫోటోని చక్రి చూస్తుంటాడు. అప్పుడే మహా వస్తుంది. ఫోన్ లో ఆ ఫోటో చూస్తుందేమోనని చక్రి టెన్షన్ పడతాడు. ఆ తర్వాత గాయత్రి బాధపడుతుంటే వాళ్ళ అమ్మ, నాన్న తన పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. తొందరగా పెళ్లి చేసుకోవాలి లీవ్స్ లెవ్వట.. అబ్బాయి వాళ్ళు చెప్తున్నారని తాయారుతో తన భర్త అంటాడు. దానిది ఏముంది వెంటనే చేసేద్దామని తాయారు అంటుంది. అయితే ఈ విషయం వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని అతను అంటాడు. అదంతా గాయత్రి వింటుంది.
మరొకవైపు మహా ప్రతీ అరుగంటలకి ఒకసారి నారాయణ దగ్గరకి వెళ్లి ట్యాబ్లెట్ ఇస్తుంది. అలా మహా వెళ్లి ఇవ్వడం ఇంట్లో వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మహా మళ్ళీ ఆరు గంటల తర్వాత నారాయణ దగ్గరికి వెళ్లి ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్తుంటే హాల్లో మాధవ కన్పించడు. ఎక్కడికి వెళ్ళాడని మహా అనుకుంటుంది. పక్కన గాయత్రితో మాట్లాడుతాడు మాధవ. నాకు పెళ్లి త్వరగా చెయ్యాలనుకుంటున్నారు బావ అని గాయత్రీ ఏడుస్తుంది. వేరే దారి లేదు మీ అమ్మవాళ్లకి నేను ఇష్టం లేదు.. అలా అని బలవంతంగా చేసుకొని నా తమ్ముళ్ళని స్టేషన్ చుట్టూ తింపలేనని మాధవ అంటాడు. ఇక మనం కలవడం ఇదే చివరిసారి అంటూ గాయత్రి ఏడస్తుంది. అదంతా మహా వింటుంది. మరుసటి రోజు బయటకు వచ్చి చూస్తే నారాయణ కన్పించడు. సైకిల్ పై వస్తాడు. అది చూసి మీరు ఇప్పుడే సైకిల్ ఎందుకు తొక్కుతున్నారని తనపై మహా కోప్పడుతుంది.
ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తారు. ఛీ స్నానం చెయ్యకుండా టిఫిన్ చేస్తున్నారని అందరికి క్లాస్ తీసుకుంటుంది మహా. మాధవ పనికి వెళ్తాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురితో మాట్లాడాలని మహా వాళ్ళని పెరట్లోకి తీసుకొని వెళ్తుంది. రాత్రి గాయత్రి, మాధవ మాట్లాడుకుంది మొత్తం మాధవ తమ్ముళ్ళకి చెప్తుంది మహా. పాపం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు.. ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






