Home

»

Tv News

Podarillu Today: తండ్రి మీద కన్నా సీరియస్.. ‌జమున దొంగతనం బయటపడుతుందా!

Oct 13, 2026 10:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 233 లో.. జమున ఇంటి మనిషిగా మారిపోవాలని ప్లాన్ వేస్తుంది. తను పని మనిషిని కాదు.. ఇప్పుడు ఈ ఇంటి మనిషిని, నలుగురు బిడ్డలకు అమ్మనయ్యాను అంటూ ఎమోషనల్ డ్రామా మొదలుపెడుతుంది. ఇన్నేళ్లు మీ పెద్దమ్మ మహా చాలా కష్టపడింది, ఇకపై ఈ ఇంటి పనులన్నీ నేనే చేస్తాను అంటూ అందరికి కాఫీలు తీసుకొస్తుంది. పెద్ది, మాధవ, కేశవ, చక్రి అంతా వద్దు నాన్న కోపంగా ఉన్నారని చెప్పినా వినకుండా నారాయణకు కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడే అసలు గొడవ మొదలవుతుంది.

జమున కాఫీ పట్టుకుని రాగానే నారాయణ కోపంతో ఆ ప్లేట్ ని, కాఫీని తన్నేస్తాడు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా.. ఈ దొంగ నాటకాలేంటి, నన్ను బుట్టలో వేసుకుందానుకుంటున్నావా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు. నువ్వు కన్న తల్లివా, ఏనాడైనా కన్నాకు పాలు ఇచ్చావా, గోరు ముద్దలు పెట్టావా, లాలించావా, అసలు ఎందుకు వదిలేసి వెళ్లావో వీళ్లకు చెప్పమంటూ నిలదీస్తాడు. అప్పుడే పెద్ది, మహా, కన్నా అంతా అక్కడకు వస్తారు.‌ఏంటి నాన్నా అంటూ అడుగుతారు.

ఇదే సమయంలో కన్నా తన తండ్రి నారాయణ మీదనే ఫైర్ అవుతాడు. అమ్మ ఇప్పుడు నా కోసం వచ్చింది.. ఆమెను ఏమైనా అంటే నిన్ను ఈ ఇంట్లోంచి వెళ్లగొడతానంటూ నారాయణకే వార్నింగ్ ఇస్తాడు. కొడుకు నోటి నుంచి అలాంటి మాట రావడంతో నారాయణ షాక్ అయి ఓ చూపు చూసి నవ్వేసి వెళ్లిపోతాడు. ఏంట్రా కన్నా ఆ మాటలు అంటూ మహా కన్నాను తిడుతుంది. తర్వాత మహా జమునను నిలదీస్తుంది. ఎందుకు కన్నాను వదిలేసి వెళ్లావని అడుగుతుంది. దీనికి జమున వెంటనే మొసలి కన్నీరు కారుస్తూ నారాయణ కోపానికి భయపడి వెళ్లా, మొదటి భార్యలానే నన్ను కూడా చంపేస్తాడేమోనని భయపడ్డా, వీధిలో వాళ్లు నన్ను భయపెట్టారు..‌అందుకే ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లిపోయా అని కట్టుకథ చెప్తుంది. ఆ మాటలను అమాయకంగా అందరు నమ్మేస్తారు, కన్నా అయితే ఎంతో బాధ పడుతున్నట్టుగా చూస్తాడు.

ఆ తర్వాత జమునకు తన రెండో భర్త ముఖేష్ ఫోన్ చేసి ఏమైనా గిట్టుబాటు అయ్యేలా ఉందా అని అడుగుతాడు. ముగ్గురు నలుగురు సంపాదిస్తున్నారు. ఎక్కడెక్కడ దాచారో తెలియాలి.. ఇంట్లో అందిన కాడికి లేపేస్తా అంటూ జమున ఇల్లంతా డబ్బు కోసం వెతుకుతుంది. చివరకు డబ్బు దొరకడంతో దొంగతనం చేస్తూ నారాయణకు దొరికిపోతుంది. నారాయణ ఏయ్ బయటకు రావే అని అరవడంతో, మహా, చక్రి, కన్నా అంతా అక్కడకు వస్తారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com