స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 232 లో బృందావనంలో పెద్ద గొడవ జరిగింది. చక్రి, మహాలక్ష్మి కన్నా తల్లి జమునను ఇంటికి తీసుకురావడంతో నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. "నీడ లేని ఆడదని చేరదీస్తే మనకే నీడ లేకుండా చేసే ఆడది ఇది, మర్యాదగా దీన్ని బయటకు పంపించేయండి" అంటూ మెడపట్టి బయటకు గెంటేయబోయాడు. అప్పుడే మహాలక్ష్మి అడ్డుపడటంతో నారాయణ మరింత రెచ్చిపోయి "నువ్వు ఎవరు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి? మా ఇంటి విషయాల్లో నీ జోక్యం వద్దు" అంటూ మహాపై అరిచాడు. దీంతో మహా చాలా బాధపడింది.
నారాయణ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. మాధవ వెంటనే తండ్రికి వార్నింగ్ ఇస్తూ "నీకు కోపం వస్తే ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కావట్లేదా? మా అందరికన్నా తనే నిన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంది, సుపుత్రా అని ఆప్యాయంగా పిలిచినందుకు నువ్వు ఎవరని అంటావా? బుద్ధి లేదా?" అంటూ ఫైర్ అయ్యాడు. కేశవ కూడా "తను వచ్చిన తర్వాతే మేము నిన్ను కనీసం మనిషిలా చూస్తున్నాం" అని నిలదీశాడు. అయినా నారాయణ వినకుండా "దీన్ని తీసుకువచ్చి ఎంత తప్పు చేశారో మీకే అర్థం అవుతుంది, అనుభవించండి" అంటూ కోపంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
కన్నా కోసమే అందరూ జమునను తీసుకువచ్చారని తెలిసి కన్నాను పిలవగా, కన్నా తలుపేసుకుని లోపల ఏడుస్తూ కూర్చున్నాడు. మహా "రేయ్ ఎందుకురా తలుపేసుకున్నావ్, నీకోసమేగా మీ అమ్మను తీసుకువచ్చింది" అని, చక్రి, కేశవ "అమ్మ ఎక్కడ అని ఎన్నోసార్లు అడిగావుగా" అని బతిమిలాడారు. అప్పుడే జమున తలుపు కొడుతూ "బాబూ ఇన్నేళ్ల తర్వాత మీ అమ్మ నీకోసం వస్తే కళ్లారా చూసుకోనివ్వకుండా తలుపు మూసుకుంటావా నాన్నా, తలుపు తియ్యి" అని ఏడవడంతో కన్నా తలుపు తీశాడు. తల్లిని చూడగానే కన్నా ఆమెను హత్తుకుని "నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు? నువ్వు బతికున్నా కూడా నేను అమ్మలేని అనాథలా బతికాను, నీకెలా మనసొచ్చిందమ్మా?" అంటూ బోరున ఏడ్చేశాడు. ఈ తల్లీకొడుకుల కలయికతో బృందావనం మొత్తం ఎమోషనల్ అయింది. మరి జమున రాకతో మాధవకు కన్నాకు మధ్య దూరం పెరుగుతుందా? నారాయణ జమున గతం గురించి చెప్పబోయే నిజం ఏంటనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.
[Podarillu Today October 10 Episode, Kanna Jamuna Emotional Reunion, Podarillu Serial Today Episode, Narayana Fires On Maha]





