Home

»

Tv News

Podarillu : మనీషా కోసం మటన్ బిర్యానీ చేసుకెళ్ళిన మాధవ.. గిఫ్ట్ అదిరింది!

Oct 28, 2026 12:03PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -247 లో...ఇంట్లో వాతావరణం కూల్ చేయడం కోసం మాధవ్ మటన్ బిర్యానీ చేస్తాడు. చక్రి, కన్నా బయటకు వెళ్లి రాగానే ఘుమఘుమలాడుతుందని అంటారు. మహా కూడా వచ్చి స్మెల్ బాగుందని అంటుంది. అందర్నీ ఫ్రెష్ అవ్వమని పంపించేసి మాధవ్ ఓ హాట్ బాక్స్ నిండా బిర్యానీ పెట్టి మనీషాకు ఫోన్ చేసి.. అన్నం తినొద్దు, నేను తీసుకొస్తానని చెప్తాడు. ఇది చాటుగా చూసిన తమ్ముళ్లు.. ఇదన్నమాట అసలు కిటుకు అని అనుకుంటారు.

చక్రి, కన్నా ఆ హాట్ బాక్స్ తీసి దాచిపెడతారు. మాధవ్ వచ్చి చూస్తే కనిపించదు. ఏరా బాక్స్ ఎక్కడరా అంటే ఏం బాక్స్.. మాకు ఏం తెలియదని నాటకం ఆడతారు. అప్పుడే మహాలక్ష్మీ హాట్ బాక్స్ ఉన్న సంచి పట్టుకుని వస్తుంది. ఎవరో తెచ్చి నా రూమ్ లో పెట్టారు పెద్ది అని అంటుంది. అన్నగారు మనకు తెలియకుండా చాటుగా మనీషా కోసం తీసిన బిర్యానీ అని చక్రి చెప్పడంతో మాధవ్ సిగ్గుపడతాడు.వెళ్లి ఇచ్చిరా పెద్ది అని మాధవని మహా పంపిస్తుంది.

మటన్ బిర్యానీ తీసుకుని మనీషా ఇంటికి వెళ్లిన మాధవ్ ని బన్సీ లోపలికి రమ్మంటాడు. మనీషా మూడు ప్లేట్లు తెస్తుంది. మీరు కూడా ఉండండి, కలిసి తిందామని మనీషా అడగడంతో మాధవ్ కూడా తింటాడు. బన్సీ ఐస్ క్రీం తేవడానికి బయటకు వెళ్లగానే ఇంట్లో మాధవ్, మనీషా మాత్రమే ఉంటారు. బిర్యానీ చాలా బాగుందని చెప్పి బహుమతిగా మాధవ్ బుగ్గపై మనీషా ముద్దు పెడుతుంది. ఈ బహుమతి కూడా చాలా బాగుందని మాధవ్ అంటాడు.ఆ తర్వాత బీహార్ నుంచి మనీషా వాళ్ల బావ ఫోన్ చేసి బెదిరించడంతో మనీషా ఏడుస్తుంది. బన్సీ వచ్చి ఏమైందని అడగ్గా బావ ఫోన్ చేసి బెదిరించాడని చెప్తుంది.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com