Home

»

Tv News

Podarillu : అసలు నిజం తెలుసుకొని మాధవ షాక్ ..మాటిచ్చిన  మహా !

Oct 27, 2026 10:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -246 లో.....కన్నా పుట్టుక రహస్యం మరొకరికి తెలిసిపోయింది. నారాయణ మహాలక్ష్మికి.. కన్నా నా కన్న కొడుకు కాదు, ఆపదలో ఉన్న జమునకు సాయం చేద్దామని తీసుకొచ్చా, చంటిబిడ్డను వదిలేసి సుఖం కోసం పారిపోయింది, అప్పటి నుంచి సొంత బిడ్డలా పెంచా, ఈ విషయం ఎవరికీ చెప్పలేదని చెప్పడం, గుడిలో దేవుడి కన్నా మీరు గొప్ప, ఇన్నాళ్లు మిమ్మల్ని తిట్టినా నోరు తెరవలేదని మహా  చేతులెత్తి మొక్కడం జరిగింది. ఈ నిజం నాతోనే సమాధి అవ్వాలనుకున్నా, వాళ్లు సొంత అన్నదమ్ముల్లా పెరిగారు, ఇప్పుడు బేధాలు చూడలేను, ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని వెళ్లిపోతాడు నారాయణ.

నారాయణ వెళ్లిపోగానే వెనుక నుంచి మాధవ్ వస్తాడు. తండ్రికి చేతులెత్తి దండం పెడతాడు. మొత్తం వినేశారా అని మహా అడుగుతుంది. మీరు నాన్నను బయటకు తీసుకొచ్చినప్పుడే ఏదో పెద్ద విషయం అని అనుసరించి వచ్చా, రాకుండా ఉన్నా బాగుండేది, తట్టుకోలేని నిజం తెలియకుండా ఉన్నా బాగుండేదని  మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపితమైంది, ఇలాంటి మనిషి మా అమ్మను చంపాడంటే ఎలా నమ్ముతా, ఊరంతా నోటికొచ్చినట్లు మాట్లాడినా నాన్న నిజం చెప్పలేదని ఎమోషనల్ అవుతాడు.

ఇన్నాళ్లు ఒకే రక్తం పంచుకున్న బిడ్డలం అనుకున్నాం, ఈరోజు కన్నా మా సొంత తమ్ముడు కాదని తెలిస్తే తట్టుకోవడం కష్టంగా ఉందని మాధవ్ బాధపడతాడు. చిన్నప్పుడు జమున వెళ్లిపోయాక కన్నాను గుండెలపై వేసుకుని ఎంత కష్టపడి పెంచాడో గుర్తుచేసుకుంటాడు. కలిసి ఉండాలంటే రక్త సంబంధం అవసరం లేదు, మీ నాన్న నుంచి వచ్చిన మంచితనం చాలు అని మహా  ఓదారుస్తుంది. ఈ విషయం తమ్ముళ్లకు తెలియనివ్వొద్దని మాధవ్ మహా దగ్గర మాట తీసుకుంటాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com