Home

»

Tv News

కన్నా వాళ్ళ తల్లి ఆచూకి కనిపెట్టిన చక్రి!

Oct 9, 2026 10:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -230 లో..... కేశవకు షాపుని గిఫ్ట్ లా ఇద్దామని మహా అంటే పెద్ది కూడా ఒప్పుకుంటాడు. నేను లక్ష, లక్షన్నర ఇస్తా అని చక్రి అంటాడు.. కన్నా కూడా తన బర్త్ డే రింగ్ అమ్మి ఇస్తా అంటాడు. షాపులో చోటుగాడు కేశవని ఓనర్ అని పిలవడం.. శైలు వచ్చి ఇదేదో మైసూర్ ప్యాలెస్ అన్నట్టు చెప్తున్నావ్.. ఈ పని నాకు నచ్చదని వెళ్లిపోవడం జరుగుతుంది.

ఆఫీసులో మహా, దివ్య ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉంటే విక్కీ వచ్చి మహాని అలా చూస్తూ ఉండిపోతాడు. కాఫీ తెచ్చి మహాకి ఇస్తాడు. దివ్యకి మాత్రం ఆఫీస్ బాయ్ కి చెప్తాడు. హృదయం ఎక్కడున్నది అంటూ దివ్య పాట పాడి నీ కోసమే చేస్తున్నాడని మహాకి హింట్ ఇస్తుంది. కాఫీకి వెళ్దామని విక్కీ అడిగితే అర్జెంట్ పని ఉందని మహా వెళ్లిపోతుంది.

ఇంకో వైపు చక్రి వీధి వీధి తిరుగుతూ జమున ఫోటో చూపిస్తూ వెతుకుతుంటాడు. ఎదురుగా వస్తున్న జమునని బైకుతో ఢీ కొట్టి కింద పడేస్తాడు, సారీ అమ్మ అని లేపుతాడు. నేను వెతికేదే ఆమె కోసం కదా అని చూసేలోపే ఆమె వెళ్లిపోతుంది. మరోవైపు జమున ఇంట్లో ముకేష్ తో గొడవ పడుతుంది.. మళ్లీ అప్పులోళ్లు వచ్చారా.. ఎన్ని రోజులు ఇలానే ఉంటావని తిడుతుంది. ముకేష్ విడిపోదాం అంటాడు.

చివర్లో  జమునని చక్రి మళ్లీ కనిపెట్టి మహాకి ఫోన్ చేసి కన్నా వాళ్ళ అమ్మ అడ్రస్ దొరికిందని చెప్తాడు. దీంతో మహా ఎగిరి గంతేస్తుంది. సాయంత్రం నన్ను పిక్ చేసుకోండి మనం వెళ్దామని చెప్తుంది. మహా హడావిడిగా వెళ్తుంటే విక్కీ బాధపడతాడు.. చక్రితో మహా వెళ్లడం చూసి రగిలిపోతాడు. చివర్లో మహా, చక్రిలను చూసి కొత్త అప్పుల వాళ్లేమో అని జమున భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com