Home

»

Tv News

Podharillu : చక్రిని నిలదీసిన గోపిక.. ఆమెకు అసలు నిజం చెప్తాడా!

Sep 30, 2026 10:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  222 లో.... చక్రి ఎందుకు ఇలా ఉంటున్నాడో అర్థం కాక మహాకు అనుమానం వస్తుంది. చక్రి డల్ గా ఉన్నాడని గోపికకు ఫోన్ చేయమని కన్నాతో మాట్లాడుతూ మహా సెటైర్లు వేస్తుంది. ఇంతలో మనీషా చేసిన స్వీట్ ను పెద్ది అందరికి ఇస్తాడు. ఇది కొన్న వాటిలా లేదే, చేసిన వాటిలానే ఉందని కన్నా అడిగితే మనీషా చేసిందని మాధవ చెప్తాడు. రోజూ అత్తగారింటికి వెళ్తున్నావా అని కన్నా, కేశవ కౌంటర్లు వేయడంతో‌.. నేను వెళ్లలేదు, తనే వచ్చింది, రాత్రి అవుతుందని సైకిల్ మీద డ్రాప్ చేశానని పెద్ది చెప్తాడు. అందరు సరదాగా ఉన్నా చక్రి మాత్రం వేరే లోకంలో ఉంటాడు.

 

గోపిక కోసం సత్య నేరుగా ఇంటికి వస్తుంది. నువ్వు చేసిన వాటికి రావాల్సి వచ్చింది.. గోపిక అక్కడ బాధ పడుతోంది.. అది సెన్సిటివ్, దాని ఫోన్స్ ఎందుకు ఎత్తడం లేదు, ఎందుకు మోసం చేస్తున్నావని చక్రిని సత్య నిలదీస్తుంది. ప్రేమ అని ఆమె పేరు పెట్టింది.. ఇప్పుడు మీరు మోసమని ఇంకో పేరు పెడుతున్నారా అని చక్రి అంటాడు. ఈ గొడవను కేశవ విని వచ్చి.. ఏమున్నా రేపు ఉదయం మాట్లాడుకోండి అని సత్యను పంపించేస్తాడు. మహాని ఉడికించాలని చూస్తే ఇది నా మెడకే చుట్టుకునేలా ఉందిరా" అని కేశవతో చక్రి చెప్తూ కంగారు పడతాడు. తర్వాత చక్రి ఫోన్ ని మహా చెక్ చేసి.. గోపిక 17 సార్లు ఫోన్ చేసిందని అడిగితే చక్రి తడబడతాడు.

 

బస్టాండ్ లో చక్రి కోసం గోపిక, సత్య ఎదురు చూస్తుంటారు. వస్తాడు, నా కోసం వస్తాడని గోపిక పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటుంది. ఇంతలో మహా, కన్నా అక్కడికి వస్తారు. గోపిక మహా వద్దకు వెళ్లి.. ఆయన ఎక్కడ ఉన్నాడని అడిగితే.. మాకేం తెలుసు, నువ్వే ఫోన్ చేసి కనుక్కోమని మహా వెళ్లిపోతుంది. గోపిక బతిమిలాడటంతో ఈ మ్యాటర్ ఈ రోజుతో తెగిపోవాలని కన్నా గోపికను ఇంటి మీదకు తీసుకొస్తాడు. గోపికను ఇలా ఇంటికి తీసుకురావడంతో నారాయణ, పెద్ది షాక్ అవుతారు. ఎవర్రా ఈ అమ్మాయి అని పెద్ది కంగారుపడతాడు.

 

 ఇంటికి వచ్చిన గోపిక.. మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అవాయిడ్ చేస్తున్నారని చక్రిని నిలదీస్తుంది. చక్రి పక్కకు తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మహాలక్ష్మిని ఉడికించాలని చేశాడు, చివరకు బెడిసి కొట్టిందని  పెద్దికి కేశవ అసలు విషయం చెప్తాడు. ఇది మహాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని పెద్ది అంటే తెలుసు అన్నయ్య అని కేశవ అంటాడు. నన్ను ఎంతో మంది ప్రేమించారు, వాళ్లందరికీ నో చెప్పా, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించానని గోపిక అంటే నేను నిన్ను చిన్న పిల్లలానే చూశా, ప్రేమ అనే ఉద్దేశంతో చూడలేదని చక్రి అంటాడు. నేను చిన్న పిల్లని కాదు, నా వయసు వాళ్లు ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారని గోపిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com