.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -235 లో..... చక్రికి మహా ఫోన్ చేసి భోజనం చేశావా అని అడగడంతో చక్రి తెగ సంబరపడతాడు. టైం రెండున్నర అయినా ఎందుకు తినలేదని మహా క్లాస్ పీకుతుంది. నిజానికి ఆమె జమునపై నిఘా పెట్టమని చెప్పడానికే ఫోన్ చేసింది. మీరు భోజనానికి ఇంటికి వెళ్తారు కదా, ఆ సుపుత్ర ఆమెతో ఎలా ఉన్నాడో తెలుసుకొని చెప్పమని అనుకున్నానని మహా చెప్పడంతో చక్రి ఉసూరుమంటాడు. అది విన్న చక్రి తను వెళ్లనని, భోజనం చేయనని అలుగుతాడు. సరే మీ ఇష్టం అంటూ మహా ఫోన్ పెట్టేయడంతో చక్రి మరింత కుంగిపోతాడు. మరోవైపు మాధవకు మనీషా భోజనం వడ్డిస్తుండగా బన్సీ వచ్చి ఇంజినీర్ పిలుస్తున్నాడని చెప్తాడు. పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి తమ్ముడి షాపు కోసం అడ్వాన్స్ అడిగావట ఎందుకని ఇంజినీర్ ప్రశ్నిస్తాడు.
తమ తమ్ముడు మెకానిక్ అని, లీజుకు తీసుకున్న స్థలాన్ని కొనడానికి రూ.7 లక్షల వరకు అవసరమని మాధవ చెప్తాడు. అంత ఇవ్వడం కష్టమే కానీ తనకు సాధ్యమైనంత వరకు ఇస్తానని ఇంజినీర్ హామీ ఇచ్చి వెళ్తాడు. అప్పుడే మనీషా తన గాజులు తీసి ఇస్తూ వీటిని అమ్మి డబ్బు తీసుకోండని చెప్తుంది. అది విని మాధవ షాక్ అవుతాడు. నీకెలా తెలుసని అడిగితే ఇంజినీర్ తో మాట్లాడుతుంటే విన్నానని మనీషా అంటుంది. మాధవ వద్దని వారించినా ఇన్నాళ్లూ తమ్ముళ్లకు ఎలాంటి వదిన వస్తుందోనని టెన్షన్ పడ్డానని, ఇప్పుడు అమ్మే వచ్చిందని అంటాడు. అటు కేశవ బైకుపై శైలుతో వెళ్తుంటూ మా ఇంటికి ఆమె వచ్చాకే సంతోషంగా ఉన్నానని అంటాడు. మరొకరిని చూసుకున్నావా.. ఇంటికే తెచ్చుకున్నావా అని శైలు అడిగితే జమున విషయం చెప్తాడు. కన్నా వాళ్ల అమ్మే కాదు.. మా నాన్నకు ఇద్దరు భార్యలని, మహాలక్ష్మి వచ్చాక అంతా మంచే జరుగుతోందని కేశవ అనడంతో శైలు కుళ్లుకుంటుంది.
మరోవైపు కేశవ కోసం ఓనర్ ని అడ్వాన్స్ అడుగుతాడు చక్రి, కానీ అక్కడ ఓంకారేశ్వర్ బదులు తమ్ముడు శ్రీకారేశ్వర్ ఉంటాడు. చిన్న కారేశ్వర్ అని పిలవడంతో అతనికి మండుతుంది. అడ్వాన్స్ కుదరదని అంటాడు. దీంతో చక్రి ఎమోషనల్ డ్రామా మొదలుపెడతాడు. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నా రక్తం ఇచ్చానని.. నీలోనూ నా రక్తమే ఉందని చెప్తాడు. ఆ సెంటిమెంట్ కి కరిగిపోయి శ్రీకారేశ్వర్ డబ్బు ఇస్తాడు. మా అన్న బిజినెస్ సెట్ చేసినట్టే నువ్వు నీ తమ్ముడి కోసం అంటున్నావని అంటాడు. ఇటు ఇంటికి వచ్చిన కన్నా అమ్మా అని పిలుస్తూ జమున కోసం గిఫ్ట్ తీసుకొస్తాడు. తల్లీకొడుకుల బొమ్మను చూసి జమున షాక్ అవుతుంది. దీన్నేం చేసుకోవాలి నెత్తికేసి కొట్టుకోవాలా అని మనసులో అనుకుంటుంది. రాత్రివేళ రెండో భర్త ఫోన్ చేసి డబ్బు సంగతేమైందని అడగ్గా.. చిల్లర మాత్రమే దొరికిందని జమున అంటుంది. జమున బయట అనుమానాస్పదంగా మాట్లాడటం మహా కిటికీలో నుంచి చూసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉండటంతో జమున అడ్డంగా దొరికిపోతుంది.






