స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -239 లో.. కేశవ దగ్గరికి శైలు రాగానే గుడ్ న్యూస్ అంటూ షాపు కొనడానికి డబ్బు సర్దుబాటు అయిందని చెప్తాడు. అదో పెద్ద గుడ్ న్యూసా అన్నట్లు శైలు తీసి పారేస్తుంది. అసలు డబ్బు ఎలా వచ్చిందని అడగగా, మహా రేయింబవళ్లు కష్టపడి రూ.1.5 లక్షలు ఇచ్చిందని, నాన్న రూ.30 వేలు ఇచ్చాడని చెప్తాడు. అంటే నేను తప్ప అందరూ ఇచ్చారని దెప్పి పొడుస్తున్నావా అని శైలు అలిగి వెళ్లిపోతుంది. మరోవైపు రమణయ్య తన ఫ్రెండ్స్ తో నారాయణ రెండో భార్య గురించి కామెంట్ చేయడంతో నారాయణ అన్నతో గొడవ పడి గట్టి వార్నింగ్ ఇస్తాడు.
ఇంట్లో దాచిన డబ్బు, కన్నా ఉంగరం కోసం జమున వెతుకుతుండగా ఆమె రెండో భర్త ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేస్తాడు. ఆ బండోడికి నువ్వు తెలుసు చూస్తే చంపేస్తాడని జమున కంగారు పడి బయటకు వస్తుంది. ఇంతలో నారాయణ దూరం నుంచే జమునను రెండో భర్తతో చూసి పరుగెత్తుకుంటూ వస్తాడు. జమున ఇంట్లోకి పారిపోగా, ఆమె భర్త వెనుకదారి నుంచి వెళ్లిపోతాడు. బండి స్టార్ట్ చేస్తుండగా నారాయణ చెప్పుతో కొట్టి మళ్లీ కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జమునపై విరుచుకుపడి మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్లిపో లేదంటే శవంగా పంపిస్తానని బెదిరిస్తాడు. ఏడాది వయసులోనే కన్నాను వదిలేసి వెళ్లావు.. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చావని నిలదీస్తాడు.
జమునను కర్రతో కొట్టబోతుండగా కన్నా వచ్చి అడ్డుపడి తల్లికి అండగా నిలుస్తాడు. నా కొడుకును వదిలి వెళ్లను.. చావైనా బతుకైనా అతనితోనే అని జమున అంటుంది. దీంతో నారాయణ మరింత ఆవేశపడి గొంతు పట్టుకోగా కన్నా విడిపించి మా అమ్మ ఇక్కడే ఉంటుంది.. నువ్వే వెళ్లిపో అంటాడు. ఇంట్లో అందరూ వచ్చాక మహా నారాయణకు మద్దతుగా మాట్లాడి జమునను నిలదీస్తుంది. మొదట భయపడ్డాను కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదని..కొడుకులనే ఏమీ అనని వాడు మిమ్మల్ని ఎందుకు అంటాడని ప్రశ్నిస్తుంది. దీంతో జమున ఈసారి వెళ్తే కొడుకును తీసుకొనే వెళ్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. రాత్రి డబ్బుతో ఉడాయించాలని ప్లాన్ వేసి కవర్ తీస్తుండగా మహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podarillu Today Episode October 17th, Podarillu Serial Star Maa, Jamuna Theft Caught By Maha, Narayana Second Wife Drama]




