Home

»

Tv News

జమున పీక పట్టుకున్న నారాయణ.. కన్నతల్లి ముఖం కూడా చూడని కన్నా!

Oct 10, 2026 10:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -231 లో....కన్నా వాళ్ళ తల్లి జమున ఆచూకీ కనిపెట్టిన చక్రి, మహాలక్ష్మి ఆమె ఉన్న చోటికి వెళ్తారు. జమున రెండో భర్తతో గొడవపడుతూ అప్పుల బాధలో ఉంటుంది. చక్రి, మహా ఆమెకు కన్నా ఫొటో చూపించి అసలు విషయం చెప్తారు. చిన్నప్పుడే వదిలేసి వచ్చానని, ఇప్పుడు గుర్తు కూడా లేదని జమున చెప్తుంది. మొగుడు వదిలేయడంతో ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్న జమునకు వీళ్లు దేవుళ్లలా కనిపిస్తారు. మా నాన్న సంగతి నేను చూసుకుంటా, మా ఇంటికి రా అని చక్రి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొస్తాడు.

కానీ ఇంట్లో.. జమునను చూడగానే కన్నా కోపంతో కన్నతల్లి ముఖం కూడా చూడకుండా లోపలికి వెళ్లిపోతాడు. ఇది చూసి ఇంట్లో అందరు షాక్ అవుతారు. మాకు ఎలాగూ అమ్మ లేదు, కన్నాకైనా ఉంది కదా అని పెద్ది అంటే, నారాయణ మాత్రం సీరియస్ గా ఫైర్ అవుతాడు.

అసలు ఇది ఎలాంటిదో మీకు తెలుసా.. ఇది మనిషే కాదు, ఆడదే కాదు. ఇప్పుడు కన్నా గాడు సంతోషంగా ఉన్నాడు. ఇలాంటిది అమ్మ అని తెలిస్తే వాడు.. అలాంటి దాని కడుపులో నేను పుట్టానా అని బాధపడతాడంటూ నారాయణ అరుస్తాడు. ఆ తర్వాత జమున పీక పట్టుకుని.. నువ్వు నా కళ్ల ముందు ఉంటే చంపేస్తా. ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి నువ్వు రావడానికి వీల్లేదు. భార్యను చంపిన పేరు నాకు ఉంది ఆల్రెడీ, ఇప్పుడు నిన్ను చంపిన పేరు నాకు రానివ్వకు.. వెళ్లిపోమంటాడు.  కేశవ అడ్డు వచ్చినా నారాయణ వినడు.దీంతో జమున ఏం చేయాలో తెలియక నిలబడిపోతుంది. ఇటు కన్నా కూడా తల్లిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. మరి జమున తిరిగి వెళ్లిపోతుందా? కన్నా మనసు మారుతుందా? అనేది రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com