Home

»

Tv News

మాధవ లవ్ ట్రాక్.. ఆటపట్టించిన ఇంటిసభ్యులు!

Oct 7, 2026 10:32AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -228 లో..... కన్నా తల్లి జమున ఫ్యామిలీ ట్రాక్ చూపించారు. జమున భర్త ముఖేష్ పని చేయకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ ఇంటికి భారంగా మారతాడు. జమునను కొడుతూ.. తిడుతూ సాధిస్తుంటాడు. నీలాంటి వాడితో కాపురం చేయడం కష్టం అని జమున అంటే నువ్వు వచ్చాకే నాకు దరిద్రం పట్టుకుందని ముఖేష్ అంటాడు. ఇంతలో అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి వడ్డీ, అసలు అన్నీ కట్టాలి, లేకపోతే నా మనుషులు వస్తారని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నా మీద కాదు నీ ప్రతాపం, అప్పులు తీర్చి చూపించమని జమున ఫైర్ అవుతుంది.

మరోవైపు కిచెన్ లో అందరు తలా ఒక పని చేసుకుంటూ ఉంటారు. నేనేం చేయాలని చక్రి అడిగితే తపస్సు చేయండని మహా అంటుంది. తర్వాత అంట్లు తోమండని చెప్పడంతో వీళ్లకి సింపుల్ పని.. నాకు అంట్లు తోమే పనా అని చక్రి అంటాడు. రేయ్ ఈ ఆనియన్ కోసి చూడు తెలుస్తుందని కేశవ కౌంటర్ వేస్తాడు. ఇంతలో చక్రికి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు.. మళ్లీ గోపికనా అని కన్నా, మహా అనుకుంటారు. చక్రి వచ్చి కన్నా వాళ్ల అమ్మ గురించి తెలిసిందని మహా చెవిలో చెప్తాడు. కరివేపాకు కావాలని మహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏం చెప్పావ్ రా అని కేశవ అడిగితే ఐ లవ్యూ చెప్పా.. తను కూడా ఐ లవ్యూ టూ చెప్పిందని చక్రి చెప్పడంతో కేశవ ఆటపట్టిస్తాడు.

ఆ తర్వాత మనీషా రాగానే కేశవ, కన్నా, చక్రి హిందీలో ఆవో కావో జావో అంటూ మాధవ రూమ్ లోకి పంపిస్తారు. మనీషాను చూసి మాధవ ఆశ్చర్యపోతాడు.. సచ్చా ఆద్మీ నేను మసాజ్ చేస్తానని మనీషా అంటుంది. మాధవ వద్దన్నా వినకుండా ఆయిల్ తో మర్దనా చేస్తుంది. డోర్ దగ్గర అందరు తొంగి చూస్తూ డిస్టబ్ చేస్తారు. కేశవ ఫోన్ అంటూ లోపలికి వచ్చి వెళ్తాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనీషా మాధవ కాలికి మర్దనా చేస్తూనే ఉంటుంది.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో తేలిపోతారు.. సమయం గడిచినట్లే అనిపించదు. నారాయణ షర్ట్ గుండీలు కుట్టాలని వస్తే అందరు తలా ఒక గుండీ కుట్టి పంపిస్తారు.

చివరగా భన్సీ వస్తాడు. భన్సీ రాగానే మనీషా ఇప్పుడే వచ్చిందని మాధవ అంటాడు. ఇప్పుడేంటి భాయ్ ఉదయం 9 గంటలకు వచ్చింది.. ఇప్పుడు రాత్రి 10 అవుతోందని భన్సీ చెప్పి మనీషాను తీసుకెళ్లిపోతాడు. పెద్దిని విడలేక విడిచిపోతున్నట్లు మనీషా చూస్తూ వెళ్తుంది. మరోవైపు ఆఫీస్ లో విక్కీ లక్కీకి గుడ్ న్యూస్ చెప్తాడు. మనకు రూ. 25 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని, అది నువ్వే డిజైన్ చేయాలని లక్కీ చేతిలో పెడతాడు. నువ్వు నా లక్కీ చార్మ్ అని విక్కీ అనడంతో లక్కీ థాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com