.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-243లో కన్నాను నవ్వించడానికి ఫ్యామిలీ అంతా తంటాలు పడుతుంది. తల్లి వెళ్లిపోయిన దగ్గర నుంచి కన్నా డల్ గా ఉండటంతో మహాలక్ష్మి ఇంట్లోనే టాస్క్ లు ఇచ్చి మామూలు మనిషిని చేయాలని ట్రై చేస్తుంది. చక్రి, కేశవ్ ఆటలు పాటలు పాడినా కన్నాలో మార్పు రాకపోవడంతో అందరు కలిసి ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్తారు. అక్కడ చక్రి ఐస్ క్రీమ్ డబ్బులు ఎగ్గొట్టడానికి పారిపోవడం, మహా అప్పటికే 500 ఇచ్చానని తిట్టడంతో కన్నా నవ్వేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిల దగ్గర చక్రి ఫోజులు కొడుతుంటే మహా కర్చీఫ్ చింపి ప్యాంట్ చిరిగినట్టు నాటకం ఆడి కన్నాను బాగా నవ్విస్తుంది.
మరోవైపు కేశవ్ కి స్థలం కొనివ్వడానికి ఫ్యామిలీ అంతా కలిసి షాపు దగ్గరకు వెళ్తుంది. మహా బుస్సును ఆట ఆడిద్దామంటూ కేశవ్ ని ఓనర్ గారు అని పిలిచి ఏడిపిస్తుంది. తర్వాత కేశవ్ వాళ్ల అన్నయ్య చేతుల మీదుగా ఓనర్ కి డబ్బులు ఇప్పిస్తాడు. దూరం నుంచి ఇదంతా చూసిన శైలూ తనను పిలవకుండా వాళ్ల ఇంట్లో వాళ్లతోనే డబ్బులు ఇప్పిస్తున్నాడని ఫోన్ కూడా తీయడం లేదని అసూయతో రగిలిపోతుంది.
స్థలం కొన్న ఆనందంలో కేశవ్ అందరికి రెస్టారెంట్ లో పార్టీ ఇస్తాడు కానీ అక్కడ కూడా కన్నా తల్లి గురించే ఆలోచిస్తుంటే మహా 20 ఏళ్ల క్రితమే లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు ఉంటుందని తిడుతుంది. ఇంటికి వచ్చాక మహా నారాయణకు పార్శిల్ బిర్యానీ తీసుకెళ్లి పెడుతుంది. అది చూసిన కన్నా.. మా అమ్మ వెళ్లిపోవడానికి కారణమైన ఇతనికి బిర్యానీ పెడతావా అని కోపంతో ప్లేట్ తీసి విసిరేయబోతాడు. దీంతో మహా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక్క మెతుకు కింద పడినా దెబ్బలు పడతాయని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
