Home

»

Tv News

ఆరులక్షల కోసం కేశవ టెన్షన్.. కుటుంబమంతా సపోర్ట్!

Oct 8, 2026 10:48AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -229 లో....కేశవకి ఓ పెద్ద కష్టం వచ్చింది. షాప్ లీజ్ పూర్తయిందని, తనకు డబ్బు అవసరం ఉందని ఈ షాప్, స్థలాన్ని అమ్మేస్తానని ఓనర్ అంటాడు. కావాలంటే నువ్వే తీసుకో, కొనుక్కోమని ఆ ఓనర్ ఆఫర్ ఇస్తాడు. ఏడు లక్షలకు అమ్ముతున్నానని నీకు అయితే యాభై వేలు తగ్గించి ఆరున్నర లక్షలకు ఇస్తానని కేశవతో అతను అంటాడు. ఆ మొత్తం ఎలా సర్దుకోవాలని కేశవ ఆలోచిస్తుంటాడు. ఇదే విషయాన్ని ఇంట్లో చెబితే చూసుకుందాం... సర్దుదామని ధైర్యం చెప్తారు. షాప్ ఓనర్ అంటూ కేశవని చక్రి, కన్నా ఆటపట్టిస్తారు.

మరోవైపు ఆఫీస్ లో లక్కీ సంతోషంగా ఉంటుంది. ఏంటి అంత సంతోషంగా ఉన్నావ్..  విక్కీ ముద్దు పెట్టాడా అని లక్కీని దివ్య అడుగుతుంది. ఏంటని సీరియస్ గా చూస్తూ రూ.25 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడని లక్కీ అంటుంది. నువ్వు నచ్చి ఇచ్చినట్లున్నాడు అని దివ్య అంటే కేవలం నచ్చితే ఇవ్వరు.. నమ్మకం ఉంటేనే ఇస్తారని విక్కీ వచ్చి కౌంటర్ ఇస్తాడు. ఈ ప్రాజెక్ట్ కి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి.. డౌట్స్ వస్తే కాల్ చేయ్ అని లక్కీకి విక్కీ ఇస్తాడు. నీ పర్ఫ్యూమ్ ఏంటని విక్కీ అడగడం.. మహా ఏం లేదని అంటుంది. నేచురల్ గానే నీ నుంచి పర్ఫ్యూమ్ వచ్చిందన్న మాట అని దివ్య అంటుంది.

ఇంకోవైపు సైట్ లో కాలి గాయంతోనే మాధవ అలియాస్ పెద్ది పనులు చేస్తుంటాడు. ఇంత నొప్పిగా ఉంటే ఎందుకు వచ్చావ్ భాయ్ అని పెద్దితో భన్సీ అంటాడు. కాస్త తగ్గిందిలే అని పెద్ది అంటే పూర్తిగా తగ్గొద్దా అని మనీషా అంటుంది. నీకు పూర్తిగా తగ్గలేదు కదా అని చేతులు పట్టుకుని కూర్చోబెట్టి కాలుని మర్దనా చేస్తుంది. సైట్ లో అందరు పెద్ది, మనీషాల్ని చూసి నవ్వుకుంటారు.. మాధవ సిగ్గుపడుతుంటాడు. ఇది నీ కోసమే తీసుకొచ్చా తిను అని స్వీట్ పోహా ఇస్తుంది. నువ్వే తినిపించు అన్నట్లు మనీషా నోరు తెరవడంతో పెద్ది సిగ్గుపడుతూనే తినిపిస్తాడు. వీరిద్దరి ప్రేమ కథను సైట్ లో అందరు చూసేస్తారు.

చోటుగాడు షాపులో పని చేసుకుంటూ ఉంటే ఓనర్ రమేష్ వచ్చి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి.. షాప్ ని అమ్మాలని చూస్తున్నానని కేశవతో అంటాడు. కేశవ డల్ గా ఇంటికి వస్తే ఏమైంది బ్రేకప్ అయిందా, జ్వరం వచ్చిందా అని ఇంట్లో వాళ్లు ఆటపడతారు. షాప్ సమస్య చెబితే దానికి ఎందుకు బాధపడుతున్నావ్ .. ఓనర్ వి కాబోతున్నావ్ కదా కంగ్రాట్స్ అని అంతా చెప్తారు. అందరం ఉన్నాం కదా నువ్వు ఆలోచించకు అని పెద్ది, మహా అంటారు. మనమంతా కలిసి కేశవకి ఆ షాపుని గిఫ్ట్ ఇచ్చేద్దామని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com