.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -227 లో.....మనీషా ఫోన్ చేయడంతో క్యాజీ, ఓజీ అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. రాత్రి పడుకునే టైంలో మనీషా నుండి ఫోన్ రాగానే తమ్ముళ్లు నిద్రపోలేదని తెలిసి పెద్ది కిచెన్ లోకి వెళ్లి మాట్లాడతాడు. మా తమ్ముళ్లు నిద్రపోలేదు.. ఆట పట్టిస్తున్నారు, రేపు ఉదయం ఫోన్ చేస్తానని వచ్చీ రాని హిందీలో మనీషాకు చెప్పాడు. ఇదంతా ముసుగులు కప్పుకుని కన్నా, చక్రి, కేశవ చాటుగా వింటారు. ఫోన్ పెట్టేసి చూసేసరికి ముగ్గురూ కనిపించడంతో ఏంట్రా మీరని పెద్ది అడిగాడు. మళ్లీ క్యాజీ అంటూ ఏడ్పించడంతో మీకు దెబ్బలు పడతాయ్ రా అని పెద్ది బెదిరిస్తా
ఉదయాన్నే పెద్ది పూజ చేస్తుండగా మనీషా నుండి ఫోన్ రావడంతో పరుగులు పెడతాడు. అదే టైంలో నిద్రలో ఉన్న చక్రి కాలు తగిలి కింద పడిపోవడంతో మాధవ కాలికి గాయమై బెణికింది. అందరు కంగారు పడి పెద్ది దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే కాలు బెణికిందని చెప్తాడు. మనీషా కాల్ కోసమే పరిగెత్తాడని తెలిసి మళ్లీ అందరు ఆట పట్టిస్తారు. నొప్పి ఎక్కువ అవుతుంటే హాస్పిటల్ కి తీసుకెళ్దామని మహా అంటుంది. దీనికి కూడా హాస్పిటల్ కి వెళ్తారా, ఎక్స్ రేలు, స్కానింగ్ లు అంటూ డబ్బులు గుంజేస్తారని నారాయణ అంటాడు. నూనె తెమ్మని చెప్పి నారాయణ నాటు వైద్యం చేయడం మొదలుపెడతాడు. ఆ నొప్పికి పెద్ది మరింతగా అరవడంతో నువ్వు నొప్పిని పెంచుతున్నావా అని అంతా తిట్టడంతో నారాయణ అలానే వదిలేసి వెళ్లిపోతాడు.
మరోవైపు కారులో చక్రి పాట పాడుతుంటే మహా కోపంగా చూస్తుంది. శ్రుతి నచ్చలేదా అని చక్రి అడిగితే శ్రుతి ఎవరని మహా ఫైర్ అవుతుంది. నువ్వు కృష్ణుడివా, గోపికతో ఇంత దూరం తెచ్చుకున్నావ్ కదా అని మహా అంది. ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారని చక్రి అడిగితే ఇదే ఏరియాలో రెండు సార్లు కన్నా అమ్మని చూశానని మహా చెప్తుంది. గోపిక ఇంటి నుండి వస్తుంటే కూడా చూశానని అంటుంది. కన్నా అమ్మ గురించి నారాయణను అడిగితే ఆమె నా దృష్టిలో చచ్చిపోయిందని, గతాన్ని తవ్వితే అస్థికలే బయటకు వస్తాయని ఫైర్ అయ్యాడు. ఏదో దాచిపెడుతున్నాడని మహా, చక్రి అనుకున్నారు. చివర్లో పెద్ది పని కోసం సైట్ కి వెళ్తానంటే మహా, చక్రి వద్దంటారు. భన్సీకి ఫోన్ చేసి కాలు బెణికిందని చెప్తే మనీషా కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
