Home

»

Tv News

చక్రికి రెండో పెళ్లి అంటూ ఫ్యామిలీ ఆట.. గోపికకు క్లాస్ ఇచ్చిన మహా!

Oct 3, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -225 లో...మహాలక్ష్మి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ముందు కన్నాని తిట్టినట్టు నటించి భయపెట్టి, వెంటనే.. పెళ్లిళ్ల బ్రోకర్ అనుకున్నావారా.. స్కూటీ ఎక్కు అంటూ నవ్వేసి గోపిక ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లో మాత్రం చక్రికి చుక్కలు చూపిస్తున్నారు నారాయణ, కేశవ, మాధవ.

పెద్దోడికి ఒక్క పెళ్లే కాలేదు, నీకు రెండో పెళ్లా.. వాటే టాలెంట్ రా అంటూ నారాయణ ఏడిపిస్తాడు. మెడకి చుట్టుకున్న పాము కరవక మానదు.. ముహూర్తాలు రెడీ అని కేశవ భయపెడతాడు. అందరు ఇల్లు ఊడ్చినట్టు, బూజు దులిపినట్టు నటిస్తూ.. గోపిక వాళ్లు వచ్చేస్తున్నారంటూ చక్రిని టెన్షన్ పెడతారు. చక్రి కన్నాకి కాల్ చేసి.. ఎక్కడున్నారని అంటే సెల్ఫీ పంపనా, వీడియో కాల్ చేయాలా అని కన్నా కౌంటర్ ఇస్తాడు.

మరోవైపు గోపిక రూంలో డోర్ వేసుకుని ఏడుస్తూ నిద్ర మాత్రలు వేసుకోబోతుంది. నేను చక్రి భార్యను అని మహా అనడంతో డోర్ తీస్తుంది. నీకు చక్రి I Love You చెప్పాడా.. సినిమాలకు, పార్క్ లకు వెళ్లారా? రోజూ ఫోన్లు చేసుకున్నారా అని మహా లాజిక్ గా అడుగుతుంది. నంబర్ ఇస్తేనే ప్రేమ అవుతుందా.. బస్టాప్ లో నేను పక్కనే ఉన్నా కదా అని మహ చెప్తుంది.

ఈ వయసులో ఆకర్షణే ప్రేమ అనిపిస్తుంది. బాగా చదువుకోవాలి.. ఏడ్చి నీ అందమైన కళ్లు ఎర్రగా అయ్యాయంటూ మహా మెల్లిగా గోపిక మనసు మారుస్తుంది. రెండు మూడేళ్లలో నువ్వు జాబ్ చేసి కారు కొంటావ్.. అప్పుడు నీ వెనకాల అందరు పడతారు. చక్రి నీకు లెక్క కాదని అనడంతో గోపిక.. అప్పుడు నేను చక్రిని కళ్లు ఎగరేసి చూస్తా.. అస్సలు పట్టించుకోనని అంటుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com