Home

»

Tv News

Podharilu :చక్రికి మహా షాక్ - గోపికతో పెళ్లి చేస్తానంటూ రివర్స్ గేర్!

Oct 2, 2026 10:39AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -224 లో.... మహాని ఉడికించాలని చక్రి చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. మహాలక్ష్మి ఈ ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటుంది. తాళిని తాళిలా అనుకోలేదు.. నన్ను భర్తగా అనుకోలేదు.. అలాంటప్పుడు నేను మాత్రం ఈ పెళ్లిని పెళ్లిలా ఎలా అనుకుంటాను. మహాలక్ష్మి ఈ పెళ్లిని నిజంగానే భావిస్తే నన్ను భర్తలా చూస్తున్నానని అంటే ఇప్పుడే వెళ్లి గోపికకి క్షమాపణలు చెప్తానని చక్రి ఇంట్లో వాళ్ల ముందు ఎమోషనల్ అవుతాడు. మహా లోపలికి వెళ్లి చక్రి మాటలను తలుచుకుంటూ ఉంటే.. నేను కాస్త ఓవర్ చేశానా అని చక్రి తనలో తాను అనుకుంటాడు.

ఇంతలో సత్య ఇంటి మీదకు వస్తుంది. చక్రి ఉన్నాడా  అని కోపంగా అడుగుతుంది. నారాయణ..‌ఎవరమ్మా నువ్వు?" అని అడిగితే.. మీరు చక్రినా? కాదు కదా, నేనే లోపలికి వెళ్లాలా, మీరే అతన్ని బయటకు పిలుస్తారా అని బెదిరిస్తుంది. గోపిక రూంలోకి వెళ్లి బయటకు రావడం లేదు.. ఆమె ఏమైనా చేసుకుంటే నీదే బాధ్యత.. కావాలనే ప్రేమించినట్టు మోసం చేశావ్ కదా అని చక్రిని నిలదీస్తుంది. నేనేం మోసం చేయలేదు.. ముందు నువ్వు నీ ఫ్రెండ్ ని జాగ్రత్తగా చూసుకోమని చక్రి అంటాడు. నారాయణ, కేశవ కూడా.. ఇక్కడ కాదమ్మా, నువ్వు అక్కడికి వెళ్లి నీ ఫ్రెండ్ ని చూసుకోమని అంటారు. గోపికకు ఏమైనా జరగాలి, నిన్ను వదిలిపెట్టనని చక్రికి సత్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

సత్య వెళ్లిపోగానే పెద్ది చక్రిపై ఫైర్ అవుతాడు. చూశావా నీ పనుల వల్ల ఒక అమ్మాయి ఎంత బాధపడుతోందోనని తిడతాడు. దీంతో చక్రి మళ్లీ మహాలక్ష్మి దగ్గరకు వెళ్లి.. నాకు పెళ్లైందని మహాలక్ష్మి చెప్పగలదా అని అంటాడు. అప్పుడే మహాలక్ష్మి రివర్స్ గేర్ వేస్తుంది. వెళ్తాను, నేనే చెప్తాను.. గోపిక ఇంటికి వెళ్తా, మా పెళ్లి గురించి చెప్తా, విడాకులు తీసుకుంటామని చెప్తా, నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో వివరిస్తానని మహా అంటుంది. నేనే వెళ్లి గోపికతో మాట్లాడి, వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఇక్కడకు తీసుకొస్తా, మీ పెళ్లి చేస్తాను, నేను ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్లేదాన్నే కదా అని మహా అనడంతో చక్రి కంగారుపడతాడు. వామ్మో ఇలా రివర్స్ అవుతోంది ఏంటని చక్రి లోలోపల భయపడతాడు. నా సమస్యని నేనే చూసుకుంటానని మాట మార్చేస్తాడు.

అయినా మహా వదలదు. మీరేం చూసుకుంటారు.. మీకు అద్దం ముందు నిలబడి జుట్టు సరి చేసుకోవడం కూడా రాదు.. మీరిక్కడే కూర్చోండి.. నేను వెళ్లి అంతా సెట్ చేస్తానంటూ నారాయణ, పెద్ది, కేశవల సపోర్ట్ తీసుకుంటుంది. వాళ్లు కూడా ఇది మంచి ఐడియా అని వంత పాడతారు. ఆ తర్వాత దారిలో కన్నాతో.. గోపిక ఇంటికి వెళ్దాం.. నిజంగానే పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్తున్నామని మహా చెప్తుంది. కన్నా బాధపడతాడు. ఎందుకు వదినా, అన్నయ్య కావాలనే జెలస్ కోసం ఓవర్ యాక్షన్ చేశాడని మీకు తెలుసు కదా అని అంటాడు. మీ అన్నకి యాక్షనే రాదు, ఇంకా ఓవర్ యాక్షన్ ఒకటి.. ఒక అమ్మాయి మనసుతో ఆడుకున్నాడు, మీకు ఇంకో వదినని తీసుకొద్దాం పదా అని మహా అంటుంది. నువ్వు నిజంగానే మీ అన్నని ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తే ఇలానే చేస్తుంటే చూస్తూ ఉండేవాడివా.. మీకు ఆడవాసన తగిలితే అన్నీ మర్చిపోతార్రా అని కన్నాని మహా తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Podarillu Serial Today Episode, Podarillu Maha Chakri, Gopika Marriage Drama, Podarillu Today]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com