Home

»

Tv News

Podharillu : గోపిక ప్రేమను తిరస్కరించిన చక్రి.. సైకిల్ పై మాధవ్, మనీషా!

Sep 29, 2026 9:45AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 221 లో...చక్రి మొత్తం డల్ గా ఉంటాడు. పార్టీలోంచి మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయావని గోపిక నిలదీస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేశా, మీరు అలా వెళ్లిపోతే నా పరువు ఏమవుతుందని అంటుంది. దానికి చక్రి.. నేను మీ బాయ్ ఫ్రెండ్ ఆ? మీకు ఏరోజైనా చెప్పానా? నేను కేవలం ఫ్రెండ్ గానే చూశా అని క్లారిటీ ఇస్తాడు. నేను మాత్రం ప్రాణంగా ప్రేమిస్తున్నానని గోపిక చెప్పినా, "నువ్వు ఇంకా చిన్నపిల్లవి, కాలేజీకి వెళ్లి బాగా చదువుకో, నాకు అలాంటి ఆలోచనే లేదు" అని ఫోన్ పెట్టేస్తాడు. దీంతో గోపిక బాగా బాధపడుతుంది.

 

మరోవైపు శైలు, కేశవల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. కేశవ కోసం శైలు ఇంట్లోంచి సున్నుండలు దొంగతనం చేసి తీసుకొస్తుంది. "ఇది మా అమ్మ మా అన్న కోసం చేసింది, కానీ నీ కోసం దొంగతనంగా తెచ్చా" అని చెప్తుంది. "నా కోసం దొంగతనాలు కూడా చేస్తున్నావా?" అని కేశవ అంటే "నీ కోసం ఏమైనా చేస్తా" అని శైలు అంటుంది. వాళ్లు ప్రేమగా మాట్లాడుకుంటుండగా చోటు వచ్చి "ఇది మన షాపేనా? నేనే తప్పుగా వచ్చానా?" అని కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత శైలు కేశవని "రేపు గొడవ జరిగితే నా వైపు ఉంటావా? మీ అన్నయ్య వైపు ఉంటావా?" అని అడిగితే కేశవ "అన్నయ్య ఇంట్లోవాడు కదా" అనడంతో శైలు అలిగింది.

 

ఇంట్లో నారాయణ జ్వరంతో బాధపడుతుంటే ఆఫీసు నుంచి వచ్చిన మహా చలించిపోతుంది. "ఇంట్లోనే ఉంటున్నావ్, మీ నాన్నని చూసుకోవచ్చు కదా" అని కన్నాని అంటుంది. దానికి కన్నా "నేను ఎప్పుడైనా నాన్న అని పిలిచానా?" అని ఎదురు ప్రశ్నిస్తాడు. మహా నారాయణ కోసం టీ, బ్రెడ్ చేసి తీసుకొస్తుంది. ఇంతలో చక్రి రాగానే "ఎక్కడికి వెళ్లావ్, ఫోన్ ఎందుకు నాట్ రీచబుల్" అని మహా అడిగితే చక్రి చిరాగ్గా సమాధానం ఇస్తాడు. చివరికి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉందని తెలుస్తుంది. మహా థర్మామీటర్, ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పడంతో చక్రి బయటకు వెళ్తాడు. నారాయణ మాత్రం "తగ్గింది కదా, మందు వేసే టైంలో మందులు ఎందుకు" అంటూ కామెడీ చేస్తాడు.

 

మరోవైపు మాధవ్, మనీషాల ప్రేమ కథ స్పీడందుకుంది. మాధవ్ కోసం మనీషా స్పెషల్ గా రసగుల్లా చేసి తీసుకొస్తుంది. తెలుగు సరిగ్గా రాకపోయినా "వచ్చింది, తెచ్చాడు, తినమని" అంటూ ముద్దుగా మాట్లాడుతుంది. "ఇది నాకు ఇష్టమని ఎవరు చెప్పారు?" అని మాధవ్ అడిగితే "మహాలక్ష్మిని అడిగి తెలుసుకున్నా" అని చెప్తుంది. రసగుల్లా చాలా బాగుందని మాధవ్ పొగడటంతో మనీషా సిగ్గుపడుతుంది. చివర్లో "మళ్లీ ఎలా వెళ్తావ్, భయం కాదా?" అని మాధవ్ అడిగితే "మీరున్నారు కదా, భయం ఎందుకు" అని మనీషా అంటుంది. దీంతో మాధవ్ మనీషాని సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podharillu, Podharillu Episode 221, Star Maa Serial, Chakri, Gopika, Keshav, Shailu, Maha, Kanna, Narayana, Madhav, Manisha]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com