స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -220 లో..... మహాను ఉడికించడానికి గోపిక బర్త్‌డే పార్టీకి వెళ్లిన చక్రి అక్కడ చిక్కుల్లో పడతాడు. చక్రిని పీకల్లోతు ప్రేమిస్తున్న గోపిక అతని రాక కోసం ఎదురుచూస్తుంది.. చక్రి రాగానే అతనికి కేక్ కట్ చేయించి ముందు చక్రికే తినిపిస్తుంది. స్నేహితులంతా గోల చేయడంతో చక్రి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు కేక్ తినిపిస్తాడు. అందరూ గిఫ్ట్ ఏదని అడిగితే కళ్లు మూసుకోమని చెప్పి బొకేలో ఉన్న గులాబీ పువ్వు తీసి గోపికకు ఇస్తాడు.
గులాబీ పువ్వు ఇవ్వగానే అక్కడ సీన్ మారిపోతుంది. అందరూ చక్రి గోపికకు ప్రపోజ్ చేశాడంటూ గోల చేయడంతో చక్రి తెల్లమొహం వేస్తాడు. గులాబీ పువ్వు ఇస్తే ప్రపోజల్ చేయడమేంటని అతనికి అర్థం కాదు. గోపిక కూడా చక్రినే తన లవర్ అని, భవిష్యత్తులో మేం పెళ్లి చేసుకుంటామని అందరి ముందు చెప్పడంతో చక్రి ఖంగుతింటాడు. వెంటనే అక్కడి నుంచి బయటపడిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్ గా ఉండటంతో అందరు ఏం జరిగిందని అడుగుతారు.. కానీ చక్రి ఎవరికి ఏం చెప్పడు.
ఇంట్లో మరో డ్రామా నడుస్తుంది. భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు ఆమ్లెట్ కోసం కన్నా గొడవ చేస్తుంటే అది చక్రి కోసమని మాధవ్ అంటాడు. ఆయన బర్త్ డే పార్టీకి వెళ్లాడని అక్కడ గోపిక కొసరి కొసరి వడ్డించి ఉంటుందిలేనని పెద్దితో మహా అంటుంది. ఇంతలో కన్నా గోపిక వాళ్ల ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి బర్త్ డే పార్టీ వీడియోలు చూపిస్తాడు. అన్నయ్య కేక్ కూడా తినిపించాడని చూపించడంతో మహాలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. అప్పుడే చక్రి వచ్చి ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటాడు. బర్త్ డే పార్టీకి వెళ్లి అక్కడ బాగా మెక్కి రాకుండా వచ్చావా అని మహా ఏడిపిస్తుంది కానీ చక్రి..నేను మా అన్నయ్య చేతి వంట తినడానికే వచ్చానని కవర్ చేస్తాడు.
అప్పుడే గోపిక కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉంటుంది. చక్రి కట్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో మాట్లాడితే మేడం గారు కొడుతుంది కదా అని చక్రి అంటే.. మేం చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు ఎందుకు ఈ నాటకమని మహా అంటుంది. తెల్లారిన తర్వాత నారాయణకు జ్వరం రావడంతో మహా సెలవు పెడతానంటుంద కానీ నారాయణ వద్దంటాడు. చక్రి నిన్నటి నుంచి డల్ గా ఉన్నాడని కేశవ్ చెప్పడంతో మాధవ్ చక్రిని పిలిచి గట్టిగా మందలిస్తాడు. నువ్వు దేనికోసం మొదలుపెట్టినా ఇప్పటితో వదిలేయి.. అనవసరంగా ఓ అమ్మాయి మనసులో లేనిపోని ఆశలు పెంచొద్దని వార్నింగ్ ఇస్తాడు. చివరకు గోపిక పదే పదే ఫోన్ చేయడంతో చక్రి లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు పార్టీ మధ్యలో వెళ్లిపోయారన్న ప్రశ్నకు ఏం లేదని తప్పించుకుంటాడు చక్రి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podarillu Serial Today Episode, Podarillu Today Episode September 26, Chakri Gopika Birthday Party Proposal, Podarillu Star Maa Serial]




