Home

»

Tv News

Podarillu: గోపికకు షాక్ ఇచ్చిన మహా.. విక్కీపై అనుమానం!

Sep 25, 2026 9:15AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 218 లో.... చక్రి ఓవరాక్షన్ తో మహాను ఇంకా ఉడికించాలని చూస్తాడు. బస్టాండ్ లో గోపిక వచ్చి.. మీరు చక్రి అక్క అవుతారా అని మహాని అడగడంతో మహాకు మండిపోతుంది. నీకు ఎందుకంటూ గోపికను తిట్టి పంపించేస్తుంది మహా. మరోవైపు ఇంట్లో చిన్న పిల్లాడు కన్నా ఉన్నాడని చూడకుండా ఫోన్ లో మాట్లాడుతూ పిల్లాడిని చెడగొడతారా అంటూ చక్రిపై మహా ఫైర్ అవుతుంది. కేశవను చూసి కన్నాను కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ చక్రిని కొడుతుంది. దీంతో పెద్ది, నారాయణ భయపడి నిద్రపోతున్నట్లు నటిస్తారు. రాత్రి జరిగిన దానికి సారీ చెప్పిన మహాతో, పెద్ది తన కోసం మనీషా క్యారేజ్ తెస్తుందని చెప్పడంతో ఇంట్లో సరదా సన్నివేశం నడుస్తుంది.

 

బస్టాండ్ లో చక్రి వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలని మహా మనసులో అనుకుంటుంది కానీ పైకి కన్నాను డ్రాప్ చేయడానికి వచ్చానని చెప్తుంది. అక్కడ ఆల్రెడీ గోపిక, సత్య చక్రి కోసం వెయిట్ చేస్తుంటారు. గోపిక మహా దగ్గరకు వెళ్లి.. చక్రి ఇంకా రాలేదేంటని అడగడంతో మహా చిరాగ్గా.. నాకేం తెలుసు, ఫోన్ చేసి కనుక్కోండి అని అంటుంది. మళ్లీ వెళ్తూ వెళ్తూ.. మీరు ఆయనకు అక్కనా అనడంతో మహా మండిపడి అక్కడి నుంచి వెళ్లమని తిడుతుంది. ఇంతలో చక్రి వచ్చి.. నా కోసం ఎలా ఎదురుచూస్తోందో చూశారా అంటూ గోపిక ముందు బిల్డప్ ఇస్తాడు చక్రి. అది చూడలేక మహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

 

ఆఫీసులో మహా ప్రజెంటేషన్ బాగా ఇవ్వడంతో దివ్య మెచ్చుకుంటుంది. వెంటనే విక్కీ వచ్చి మహాకు స్వీట్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చి..‌అదరగొట్టావ్ లక్కీ అంటూ పొగిడి కాఫీకి బయటకు వెళ్దామని అడుగుతాడు. ఇది గమనించిన దివ్య.. మహా మీద విక్కీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని.. ఇది కాఫీ నుంచి డేటింగ్ వరకు వెళ్తుందని మహాకు చెప్తుంది. దీనికి మహా..‌నాన్ సెన్స్ గా మాట్లాడకంటూ సీరియస్ అవుతుంది. ఎపిసోడ్ చివర్లో కేశవ్ షాప్ దగ్గరకు చక్రి వెళ్లి ఏసీ రిపేర్ చేయమని అడుగుతాడు..‌శైలు రావడంతో శైలు, కేశవ మధ్య మళ్లీ గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podharillu, Podharillu Episode 218, Star Maa Serial, Maha, Chakri, Gopika, Kanna, Keshav, Divya, Vicky]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com