స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -240 లో.....మహాలక్ష్మీ ప్రాజెక్ట్ పూర్తయ్యి లక్షన్నర డబ్బులు రావడంతో తెచ్చి పెద్దికి ఇస్తుంది. డబ్బులన్నీ బ్యాగులో పెట్టి దాచిపెడతాడు. ఇది చూసిన జమున కళ్లల్లోనే తేడా కొడుతుందని మహాలక్ష్మీ గమనిస్తుంది. అర్ధరాత్రి అందరు నిద్రపోయిన తర్వాత జమున మొగుడు ఇంటికి వస్తాడు.తనని పిలిచి త్వరగా డబ్బులు తీసుకుని రమ్మని అంటాడు. పని ఉండటంతో మహా ఇంకా నిద్రపోదు. వారి మాటలన్నీ విని షాక్ అవుతుంది. పుట్టినప్పుడే వాడిని పడేసి వచ్చిన దాన్ని.. ఇప్పుడు కొత్తగా వాడి మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందని జమున అనడం విని మహా మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇంట్లోకి వచ్చిన జమున డబ్బులు ఎక్కడ పెట్టారో వెతికి దొరికించుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మీ.. ఏం చేస్తున్నావని నిలదీస్తుంది. ఏం లేదని డబ్బులు సంచి వెనక దాచుకుంటుంది. మర్యాదగా ఆ డబ్బులు అక్కడ పెట్టకపోతే నీ సంగతి తేలుస్తానని, ఎవడు వాడు, నీ దొంగతనాల్లో పార్టనర్ ఆ అని హెచ్చరిస్తుంది. అసలు కన్న కొడుకుపై ప్రేమలేని నీలాంటి ఆడది కూడా భూమి మీద ఉంటుందా అని ఛీ కొడుతుంది. ఈ విషయం తెలిస్తే కన్నాగాడు ఎంత బాధపడతాడో తెలియదా అని నిలదీస్తుండగా మహాలక్ష్మీని నెట్టేసి జమున తన మొగుడితో పారిపోతుంది. దీంతో మహాలక్ష్మీ డబ్బులన్నీ తీసి పెట్టెలో పెట్టి తాళం వేస్తుంది.
తెల్లారిన తర్వాత తల్లి కోసం కన్నా వెతుకుతాడు. నారాయణ ఏదో చేశాడని చొక్కా పట్టుకుని కన్నా నిలదీయగా మహాలక్ష్మీ వచ్చి కన్నాని తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Podarillu Serial Today Episode October 19th, Podarillu Serial Star Maa, Jamuna Steals Money Maha Catches, Jamuna Escapes With Husband]




