.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -250 లో..... కన్నా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. నాకోసం ఎందుకు రాలేదని అలుగుతాడు. చక్రిని అన్నయ్య అని పిలవను అని కన్నా అంటాడు. దాంతో చక్రి బాగా ఫీల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఊరికే అన్నానని కన్నా అంటే, అన్నది మర్చిపోయావా, అన్నయ్యలను మర్చిపోయి వెళ్లావ్ అందుకే వాడిని ఏడిపిస్తున్నావని కేశవ అంటాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తే తన చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటాడు చక్రి. నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావ్, ఆ అధికారంతో కొట్టాను తప్పా అని మహా అంటుంది.
నువ్వు నన్ను కొట్టావ్, నీకిష్టమైన మనిషి కోసం కొట్టావని కన్నా అంటాడు. వెతకాలని అనుకునేవాడివి ఎందుకు వెళ్లావురా అని మహా అంటే, ఉంటే ఉండు పోతే పో అన్నావుగా అని కన్నా ఎదురు చెప్తాడు. మరి నీ కన్నతండ్రినే చచ్చిపోమ్మని అనలేదా, ఎంత పెద్ద తప్పు మాటరా అని మహా కోప్పడుతుంది. చిన్నప్పటినుంచి నువ్వు ఏం అన్నా నిన్ను ఏమైనా అన్నాడా.. మనమంతా ఒకే కుటుంబంరా అని మహా అంటుంది. నిన్ను కొట్టినందుకు మీ చక్రి అన్నయ్య నన్ను అనరాని మాటలు అన్నాడని చక్రిని మహా ఇరికిస్తుంది. మీరిద్దరు కలిసిపోయారా అని చక్రి అంటాడు.
నువ్వు ఎవరినైతే అన్నావో ఆ నాన్న నీ వెనుక సైకిల్ తీసుకుని వచ్చాడని మహా అంటుంది.కావాలంటే అటు చూడు ఇప్పుడే ఇంటికి వస్తున్నాడని నారాయణను చూపిస్తుంది మహా. నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు కాల్ చేసి చెప్తేనే నేను నమ్మకంగా ఉన్నానని మహా అంటుంది. నీకు ఆయన దేవుడు కావచ్చు, నాకు మాత్రం రాక్షసుడే అని అనేసి కన్నా లోపలికి వెళ్తాడు. వాన్ని నిదానంగా కూల్ చేస్తానని మహా అంటుంది. ఇంతలో బీడీ తాగుతూ పొలమారి దగ్గుతాడు నారాయణ.. దాంతో కేశవ నీళ్లు ఇస్తాడు. సుపుత్ర అంటే చాలు పసివాడు అయిపోతాడు..తల్లిగా ఆయన్ని మందలించడం నాకు ఇష్టమని మాధవతో మహా అంటుంది.
మరుసటి రోజు ఉదయం కన్నాకు తల దువ్వుతాడు చక్రి, అమెరికా వీసా గురించి మహా, చక్రి సరదాగా గొడవ పడతారు. కన్నాకు కేశవ డ్రెస్ తెస్తే చక్రి తనది అనుకుని ఫిట్నెస్ గురించి బిల్డప్ ఇస్తాడు. వీడు 20 సార్లు జిమ్ ఫీ కట్టి వెళ్లలేదని కేశవ ఎగతాళి చేస్తాడు. షాప్ ఓపెనింగ్ వచ్చే గురువారం ఏకాదశి మంచిరోజని పెద్ది అంటాడు. ఇంతలో పెద్దికి మనీషా కాల్ చేస్తే, బన్సీ అని చెప్పి మాధవ కాల్ మాట్లాడతాడు. బిస్కెట్ అంటూ అన్నదమ్ములు ఏడిపించడంతో పెద్ది కర్ర పట్టుకుంటాడు. కన్నా పడిపోతుంటే నారాయణ పట్టుకుని కాపాడతాడు.తర్వాత కన్నాను డ్రాప్ చేసి మీ వదినకు బాగా పొగరుగా అని మహా అంటే, తను తండ్రి అనుకోడానికి కంపరంగా ఉందని కన్నా అంటాడు. చివర్లో చక్రిని అర్జంట్‌గా రావాలని మహా పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
