Home

»

Tv News

Podarillu: నారాయణ కన్నకొడుకు కన్నా కాదు.. షాకింగ్ నిజం బయటపెట్టిన జమున.!

Oct 25, 2026 11:43AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -245 లో... పుట్టుకపై దిమ్మతిరిగే నిజం బయటపడింది. వెజ్ పులావ్ ప్లాన్ లో అందరూ కన్నాను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో కన్నా బాధపడతాడు. బయటకు వెళ్లిన మహాకు జమున కనిపించడంతో నిలదీస్తుంది. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లిపోయారు.. మీ వెంట ఉన్న వ్యక్తి ఎవరు.. కన్నకొడుకును 20 ఏళ్ల తర్వాత చూసి ఎందుకు వదిలేశారు.. లక్షల్లో దాచిన డబ్బు కాదు అందరూ కష్టపడి సంపాదించిన డబ్బును ఎందుకు దొంగతనం చేయాలనుకున్నారని ప్రశ్నిస్తుంది.

మొదట బుకాయించిన జమున తర్వాత నిజం చెప్తుంది. నాతో ఉన్న వ్యక్తి నా భర్త, ఊరంతా అప్పులు చేశాడు.. అందుకే దొంగతనం చేయాల్సి వచ్చింది.. 20 ఏళ్ల తర్వాత ప్రేమతో వచ్చానని ఎలా అనుకున్నారని అంటుంది. మరి నారాయణ ఎందుకు అంత ద్వేషిస్తున్నాడని మహా అడుగుతుంది . కన్నా అసలు నారాయణ కన్న కొడుకు కాదని జమున చెప్పి  షాక్ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఇంట్లో కన్నా, నారాయణ గొడవ పడుతుండగా మహా నారాయణను గుడికి తీసుకెళ్లి నిలదీస్తుంది. నారాయణ అసలు కథ చెప్తాడు . కన్నా నా కన్న కొడుకు కాదు, లారీ నడిపే రోజుల్లో గుజరాత్ లో హోటల్ నడిపే జమునాబాయి, ఆమె భర్త గోవిందు పరిచయం అయ్యారు.. వాళ్లకు అప్పటికే కన్నా పుట్టాడు.. గోవిందు చనిపోయాక ఒంటరైన జమునను అందరూ అనుభవించాలని చూడడంతో ఆశ్రయం ఇచ్చి తీసుకొచ్చాను.. పెళ్లి చేసుకోలేదు, కొడుకులకు అర్థం కాదని.. సమాజం అర్థం చేసుకోదని భార్యగా చూసాను .  తర్వాత ముకేష్ అనేవాడి కోసం నెలల పసివాడిని వదిలేసి వెళ్లిపోయింది. అందుకే కోపం, అప్పటి నుంచి కన్నాను నా కొడుకులతో సమానంగా పెంచుతున్నానని  చెప్తాడు . 

ఈ నిజం కన్నాకు చెప్పొద్దని, తల్లి వదిలేసి వెళ్లింది.. తండ్రిని కూడా కాదని తెలిస్తే అనాథగా ఫీల్ అవుతాడని నారాయణ అంటాడు. మహా ఎమోషనల్ అయి .. మీరు నిజంగానే దేవుడు, చాలా గొప్పవాళ్లని నారాయణ చేతిని మొక్కుతూ కంటతడి పెడుతుంది. ఇంటికి వచ్చాక చక్రి అడిగినా నిజం దాచేస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Podarillu Serial Episode 245, Podarillu Oct 24th Episode, Podarillu Today Episode, Podarillu Latest Episode, Podarillu Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com