
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -226 లో.....మహా గోపికకు ప్రేమకు, ఇష్టానికి తేడా చెప్పి అది ప్రేమ కాదని, కెరీర్ పైనే ఫోకస్ పెట్టాలని వివరిస్తుంది. తన లైఫ్ బుక్ ని ఎవ్వరికి రాసే ఛాన్స్ ఇవ్వకూడదని.. ఇలాంటి బుట్టబొమ్మ సులువుగా దొరకకూడదని చెప్పడంతో గోపిక తన ఫోన్ లో ఉన్న చక్రి ఫోటోలు డిలీట్ చేస్తుంది. నువ్వు రాకపోతే నేనేమైపోయేదాన్నో, నువ్వు చాలా గ్రేట్ అంటూ మహాను గోపిక హగ్ చేసుకుని థాంక్స్ చెప్తుంది.
మరోవైపు ఇంట్లో మాధవ, కేశవ, నారాయణలు కలిసి చక్రిని ఆటాడుకుంటారు. రెండో కోడలు గోపిక ఎప్పుడొస్తుంది.. ఇంకాసేపట్లో పెళ్లి వాళ్లు వస్తున్నారు.. మేనమామ కూడా వస్తున్నాడంటూ ఫోన్ డ్రామా చేస్తారు. చక్రి భయపడి.. మీకు మనస్సాక్షి ఉందా? నేను మహాలక్ష్మిని తప్ప ఎవ్వరిని భార్యగా ఊహించుకోలేను.. మహా వెళ్లిపోతే నా జీవితం చీకటే అని ఎమోషనల్ అవుతాడు. దీన్ని కేశవ రహస్యంగా వీడియో తీస్తాడు. చక్రి పారిపోవాలని చూస్తే నారాయణ అడ్డుకుని.. నువ్వు తప్పు చేసిన ఖైదీవి అని అంటాడు.
చివరికి మహా, కన్నా ఇంటికి వచ్చి.. వెనకాల కారులో గోపిక వాళ్ల అమ్మా నాన్న వస్తున్నారు.. చైను, వాచీ, ఉంగరం పెడతారట అని ఇంకా భయపెడితే చక్రి గదిలో దాక్కుంటాడు. తర్వాత కేశవ తీసిన వీడియోను మహాకి చూపించడంతో భర్త ప్రేమ తెలుసుకుని మహా ఫీల్ అవుతుంది. సాయంత్రం మనం బయటకు వెళ్తున్నామని మహా చెప్పడంతో చక్రి మురిసిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






