Home

»

Tv News

పండు మాస్టర్ రికవరీ జర్నీ వీడియో వైరల్.. మూడు రోజుల్లోనే 2.4 మిలియన్ వ్యూస్

Oct 7, 2026 9:46AM

" ఢీ" షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో అభిమానులు  ఆందోళనకు గురయ్యారు. అలాంటి  పండు మాస్టర్ రీసెంట్ గా  తన ఆరోగ్య పరిస్థితిపై  లేటెస్ట్  అప్డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

సుమారు నాలుగు నెలల క్రితం విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్‌కు  వెళ్లి  హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఆపి రోడ్డు పక్కన నిలబడి ఉన్న పండు మాస్టర్‌ను వేగంగా వచ్చిన ఓ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పండు మాస్టర్‌ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అవసరమైన ఆపరేషన్లు  నిర్వహించారు.  తర్వాత కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ  రెస్ట్ తీసుకుంటున్నాడు.

డ్యాన్స్‌నే తన జీవితంగా భావించే పండు మాస్టర్‌కు కాళ్లకే తీవ్ర గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఎంతో బాధపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద సంఖ్యలో అభిమానులు, నెటిజన్లు ప్రార్థనలు చేశారు. అలాటి  పండు మాస్టర్ తన రికవరీ జర్నీకి సంబంధించిన ఓ చిన్న వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ‘రికవరీ జర్నీ.. మై ఫస్ట్ వీడియో గ్లింప్స్’ పేరుతో రిలీజ్  చేసిన ఈ వీడియో సుమారు 1.25 నిమిషాలు.  ఉంది.  
త్వరలో  ఫుల్ వీడియొ రిలీజ్  చేస్తానని చెప్పాడు . తన కోసం ప్రార్దించిన  ప్రతి ఒక్కరికీ  కృతజ్ఞతలు తెలిపారు.  ఇక మీద ఇలాగే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానని అందరూ ఎప్పటిలాగే సపోర్ట్ చేయాలని కోరుకున్నారు. ఇక ఈ వీడియోని పోస్ట్ చేసిన మూడు రోజుల్లో మొత్తం 2.4  మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక పండు ఫాన్స్ ఐతే  " తొందరగా కోలుకోవాలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్న పండు అన్న మళ్ళీ నువ్వు డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్న అన్న ... నువు తొందరగా కోలుకొని మా అందర్నీ ఎప్పటిలాగే నవ్వించాలని   దేవుని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్న." అంటూ పోస్ట్ చేసారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com