Home

»

Tv News

బన్నీకి అలాంటి పాటలు ఇచ్చావ్.. మాకేంటి..తమన్‌పై ఎన్టీఆర్ ఫైర్!

Oct 26, 2026 4:37PM

తెలుగులో అద్భుతమైన పాటలు ఉన్న సినిమాల గురించి మాట్లాడితే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో  సినిమా కచ్చిత్మగా  గుర్తొస్తుంది. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలోని పాటలు రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టించాయి.  సినిమా విడుదలయ్యాక  కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు ఆడియన్స్ ని క్రికెటర్స్ ని కూడా  విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్  తమన్, డైరెక్టర్  త్రివిక్రమ్‌పై జూనియర్ ఎన్టీఆర్ సరదాగా కోప్పడ్డారట.  తమన్ తనకు ఒక తరహా పాటలు ఇచ్చి, అల్లు అర్జున్‌కు మాత్రం ఇంత అద్భుతమైన పాటలు ఇవ్వడమే అందుకు కారణమట. ఈ ఆసక్తికరమైన విషయాన్ని తమన్, త్రివిక్రమ్ రీసెంట్ గా  ఓ టాక్ షోలో వెల్లడించారు.
 
పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ మూవీ చేసిన  తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో  వచ్చిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ  దసరా సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కూడా తమనే సంగీతం అందించారు. అయితే ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ పాత్రను మాస్ యాక్షన్ నేపథ్యంలో చూపించగా, ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్‌ను స్టైలిష్‌గా చూపిస్తూ అద్భుతమైన పాటలను అందించారు. దీంతో తమన్, త్రివిక్రమ్ ఇద్దరినీ ఎన్టీఆర్ సరదాగా ఆటపట్టించారట.

రీసెంట్ గా టెలికాస్ట్ ఐన  ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో ఈ విషయాన్ని తమన్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికీ తమపై కోపంగా ఉంటారని సరదాగా చెబుతూ, ఆయన తనకు ఫోన్ చేసి అన్న మాటలను వివరించారు. ‘మాకేమో ఏడపోయినావో, ఎప్పుడొస్తావో, ఎప్పుడు వెళ్లిపోతావో పాటలు ఇచ్చావు. వెంటనే బన్నీకి సామజవరగమన, బుట్ట బొమ్మ, రాములో రాముల ఇచ్చావు’ అంటూ ఎన్టీఆర్ ప్రశ్నించారని తమన్ నవ్వుతూ చెప్పారు.
ఎన్టీఆర్ మాట్లాడే విధానం అందరికీ తెలుసని, ఆయన సరదాగా తిట్టినా వినడానికి చాలా బాగుంటుందని తమన్ చమత్కరించారు. దీనిపై త్రివిక్రమ్ కూడా స్పందిస్తూ, ఎన్టీఆర్ తమ ఇద్దరినీ వదలకుండా ఆటపట్టించారని గుర్తుచేసుకున్నారు. ‘నన్నేమో ఎండల్లో నిలబెట్టి, మీద దుమ్మేసేసి, చొక్కాలిప్పించేశారు’ అంటూ ఎన్టీఆర్ తమ సినిమా విషయంలో సరదాగా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com