Home

»

Tv News

జాతకం ప్రకారమే బిజినెస్ చేస్తా .... ఇంతకీ రీతూ ఏ రంగంలోకి వస్తుందంటే

Oct 9, 2026 10:19AM

బిగ్  బాస్ ఫేమ్  అఖిల్ సార్థక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలెవ్ సలోన్ ని స్టార్ట్ చేసి బిజినెస్ రంగంలోకి దిగాడు. 2024 లో హీరో నాగార్జున చేతుల మీదగా ఈ సలోన్ కి రిబ్బన్ కటింగ్ చేయించి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల తన ఫ్రెండ్స్ మధ్యలో సెలెబ్రేషన్స్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఈ ఈవెంట్ కి రీతూ చౌదరి కూడా హాజరయ్యింది. ఇక ఆమెను కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది మీడియా. దానికి ఆన్సర్స్ చెప్పింది కానీ అసలు ప్రశ్నకు ఆన్సర్ చెప్పనివ్వకుండా అఖిల్ ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

"నేను నా బెస్ట్ ఫ్రెండ్ సలోన్ లో హెయిర్ కట్ కానీ హెయిర్ కలర్ కానీ చేయించుకుంటూ ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ కెరీర్ తో పాటు బిసినెస్ లో కూడా అడుగుపెట్టి చక్కగా రాణిస్తున్నాడు. ఈ సలోన్ పెట్టి రెండేళ్లయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి యానివర్సరీలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నా అని చెప్పింది.  ఇక బిగ్ బాస్ విషయం అడిగేసరికి "నాకు ఇప్పుడు బిగ్ బాస్ లో ముఖేష్ తెలుసు. మేము కొన్ని షోస్ లో కలిసి పని చేసాం. వర్షిణితో ఒక షోలో వర్క్ చేశా కానీ అంతకు మించి నాకు ఎవరూ అంత క్లోజ్ కాదు." అని చెప్పింది. "రీతూ పెడితే ఎలాంటి బిజినెస్ పెడాతారు ఫ్యూచర్ లో బిజినెస్ పెడితే ఎలాంటి బిజినెస్ పెడతారు " అన్న ప్రశ్నకు "చూడాలి. ఆలోచనలు ఉన్నాయి. కానీ నా జాతకం ప్రకారం ఏ బిజినెస్ బాగుందో గురువు గారిని అడిగి పెడతాను. ప్రస్తుతానికైతే బిజినెస్ మీద అంత ఇంటరెస్ట్ లేదు కానీ ఇంటరెస్ట్ తెచ్చుకుని పెడతాను. ఫ్యూచర్ లో స్టార్ట్ చేయాలనుకుంటే ఫుడ్ బిజినెస్ లాంటిది పెడతాను . "అని చెప్పింది. "ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు " అని అడిగిన ప్రశ్నకు "టీవిలో ఒక షో ఉంది. ఒక నెలరోజుల్లో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది " అని చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com