చైనాలో, అమెరికాలో కూడా నూకరాజు వీడియోస్ వైరల్
on Feb 5, 2025
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నూకరాజు మంచి జోష్ తో స్కిట్ చేసాడు. తాగుబోతు రమేష్, నూకరాజు స్కిట్ లో చాలా కామెడీ చూపించారు. ఐతే రీసెంట్ గా నూకరాజు "గుట్టకింద " అనే సాంగ్ పాడి ఆసియాతో కలిసి వీడియో సాంగ్ కూడా చేసాడు. ఆ సాంగ్ దాదాపు 11 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి. సోషల్ మీడియా ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే నూకరాజు డాన్స్ స్టెప్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఏ షో ఎపిసోడ్ లో ఐనా కూడా నూకరాజు ఈ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా ఇదే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. రాగానే తాగుబోతు రమేష్ కూడా డాన్స్ వేసాడు.
"ఈ పాట పాడింది నువ్వేనారా" అని అడిగాడు. "అవును సర్ ..ఈ పాటలో మేల్ సింగర్ ని నేనే సర్..రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సర్. అందరూ మా వీడియోలే చూస్తున్నారు. చైనాలో మా వీడియోలే అంతెందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సర్ " అన్నాడు. దానికి తాగుబోతు రమేష్ "రాత్రి అమెరికా వీడియోలు చూసానే నీ వీడియో లేదయ్యా" అన్నాడు. " సర్ మీరు గుట్ట కింద వీడియో కాకుండా గుట్ట వెనకాల వీడియోలు చూసుంటారు సర్" అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ తో తాగుబోతు రమేష్ పరువు తీసేసాడు నూకరాజు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
