.webp)
జబర్దస్త్ ప్రతీ వారం లాగే ఈ వారం లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ షోకి నాగబాబు మళ్ళీ రి- ఎంట్రీ ఇచ్చాక కొన్ని ఎపిసోడ్స్ కి హైపర్ ఆది వచ్చాడు. ఇక ఇప్పుడు నూకరాజు, చమ్మక్ చంద్ర మళ్ళీ వచ్చారు. రావడమే అందరినీ నవ్వించారు. ఎందుకొచ్చారో షోకి తిరిగి చెప్పారు. జడ్జెస్ నాగబాబుని, ఇంద్రజమ్మని దేవుడు, దేవత అంటూ తెగ పొగిడేసాడు నూకరాజు. దాంతో రియాజ్ వెంటనే భజన బాగా చేస్తున్నావ్ ఈవెంట్ మాట్లాడమంటావా అని అడిగేసరికి నూకరాజు నవ్వేసాడు.
వెంటనే రియాజ్ మళ్ళీ "జబర్దస్త్ కి మళ్ళీ ఎందుకొచ్చావు " అని నూకరాజుని అడిగాడు. "అమ్మ కోసమే వచ్చానురా " అంటూ చెప్పాడు. వెంటనే రష్మీ రియాక్ట్ అయ్యింది. "ఇప్పుడు నిజం చెప్పు" అని అడిగింది. "కొంచెం ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి అందుకే వచ్చాను " అని అసలు నిజం బయటపెట్టాడు. దాంతో ఇంద్రజ, నాగబాబు పడీపడీ నవ్వారు. "నువ్వు ఉన్నావని శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలి వచ్చింది అమ్మ. నువ్వు మళ్ళా జబర్దస్త్ కి వచ్చావు. పాపం ఆమె ఎక్కడికి పోతదో ఏమో " అంటూ రియాజ్ అన్నాడు.
వెంటనే ఇంద్రజ రియాక్ట్ అయ్యారు. "అరేయ్ ఉండండ్రా ఈఎంఐలు మీకే కాదు మాకు ఉన్నాయి " అంది. "మరి స్కిట్ కి 5 వేలే ఇస్తే ఈఎంఐలు కాకపోతే ఇంకేమోస్తాయమ్మా " అన్నాడు నూకరాజు కామెడీగా. తర్వాత చమ్మక్ చంద్ర వచ్చాడు. ఎప్పటిలాగే లేడీస్ మీద సెటైరికల్ స్కిట్ వేసాడు చంద్ర. "కుక్క అరవడానికి పిల్లి అరవడానికి ఒక రీజన్ ఉంటుంది. కానీ పెళ్ళాలు అరవడానికి ఏ రీజన్ అక్కర్లేదు మొగుడు ఉంటే చాలు" అన్నాడు.
దానికి నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు. "నేనొప్పుకుంటాను దీనికి " అన్నాడు. ఇక చమ్మక్ చంద్ర తాను కూడా ఎందుకు వచ్చాడో చెప్పాడు. "చాలా రోజులయ్యింది నా ఇంట్లో అడుగు పెట్టి ఒకసారి అడుగు పెట్టేసి నేను కూడా వైబ్రేట్ అవుదామని వచ్చా " అన్నాడు. "బాగా చేస్తున్నాడు కానీ మధ్యలో కొన్ని ఇష్యుస్ ఉన్నాయని అనుకున్నా కానీ ఇప్పుడు లేదు " అన్నాడు నాగబాబు. "అన్నీ క్లియర్ చేసి తీసుకొచ్చా" అని చెప్పాడు చమ్మక్ చంద్ర.
---------------






