Home

»

Tv News

హే బేబీ ఏంట్రా...పనిపాట లేక పక్కోళ్ల మీద పడి ఏడుస్తారేంట్రా!

May 18, 2026

సోషల్ మీడియాలో నిఖిల్ విజయేంద్ర సింహ అంటే తెలియని వాళ్ళు లేరు. ఐతే రీసెంట్ గా తన నంబర్ తో ఎవరో తెలియని వ్యక్తి తనకు తెలిసిన వాళ్ళతో చాట్ చేస్తున్నాడని తెలుసుకుని బ్లాక్ చేయాలంటూ ఒక అలెర్ట్ మెసేజ్ అలాగే ఒక వీడియోని తన స్టేటస్ లో పెట్టాడు. "ఈరోజు నిద్ర లేచేసరికి ఒక చెత్త విషయం తెలిసింది. నా పేరుతో ఎవరో ఒక వ్యక్తి చాలామందికి మెసేజెస్ పంపించారంటూ అందరూ నాకు మెసేజ్ చేశారు.

అదృష్టవశాత్తు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అవి పంపిస్తున్నది  నేను కాదని వెంటనే గ్రహించి, ఆ మెసేజ్‌ను వెంటనే బ్లాక్ చేశారు..ఫ్రెండ్స్  మీకు ఏవైనా గుర్తుతెలియని సందేశాలు వస్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి. నా వ్యక్తిగత స్నేహితులందరి దగ్గర  నా కాంటాక్ట్ నంబర్ ఉదని.  నేను ఎలా మాట్లాడతానో  వారికి తెలుసు.ధన్యవాదాలు. " అనే మెసేజ్ ని నిఖిల్ విజయేంద్ర సింహ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. అంతే కాదు జిమ్ కి వెళుతూ కూడా వాళ్ళను చెడామడా తిట్టాడు. "కామెడీ ఏంటంటే ఎవడైతే ఇదంతా చేసాడో వాడు నాకు ఎప్పటినుంచో తెలిసిన ఒక వ్యక్తికీ చాల పెద్దావిడకు నేను సిస్టర్ లా ట్రీట్ చేసే ఆవిడకు హే బేబీ అంటూ అర్ధరాత్రులు మెసేజ్ లు పొద్దున్న మిస్డ్ కాల్స్ .

ఆర్ యు ఫ్రీ కాల్ మీ అని పంపిస్తున్నాడు. అస్సలు హే బేబీ ఏంట్రా. పని పాట లేని మనుషులు ఎంతమంది ఉన్నారంటే ఎంప్లాయిమెంట్ లేక, సెల్ఫ్ కేర్ లేక సంపాదించలేక ఇలా పక్కోళ్ల మీద ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ మీద ఏడుస్తూ ఎందుకురా ఇలా ఉన్నారు మీరంతా ఏదో ఒకటి పెంట చేయాలి ఏదో ఒకటి అనాలి పక్కోడి మీద ఏదో ఒక న్యూస్ చేయాలి " అంటూ ఒక ఇరిటేటింగ్ ఫేస్ పెట్టుకున్నాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com